Begin typing your search above and press return to search.

'డాకు మహారాజ్‌'కి సమర సింహారెడ్డితో పోలిక!

సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలతో దూసుకు పోతున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2025 4:19 AM GMT
డాకు మహారాజ్‌కి సమర సింహారెడ్డితో పోలిక!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి 12వ తారీఖున రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య మరో నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చిన పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో తమన్‌ కుమ్మేయడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలతో దూసుకు పోతున్నారు.

తాజాగా నిర్మాత నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై మూమెంట్ ఉంటుంది అంటూ సినిమాపై అంచనాలను పెంచారు. అలాగే ఇంటర్వెల్ కి ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయంటూ ఆయన హామీ ఇచ్చారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సమరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ గొడ్డలితో చేసే యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బాలకృష్ణ నుండి అలాంటి యాక్షన్ సన్నివేశాలను చూడబోతున్నారని చెప్పుకొచ్చాడు.

డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ గొడ్డలితో చేసే యాక్షన్ సన్నివేశాలకు మంచి స్పందన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించింది. అఖండ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ఈమె నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా సెంటిమెంట్‌గా వర్కౌట్ అయ్యేనా చూడాలి. కీలక పాత్రల్లో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా నటించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్‌ విలన్ గా నటించడం ద్వారా అంచనాలు మరింతగా పెరిగాయి.

బాలకృష్ణ ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమాతో నాలుగవ విజయాన్ని బాలకృష్ణ సొంతం చేసుకోబోతున్నాడు అంటూ నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్‌ ఛేంజర్‌, వెంకటేష్‌ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సైతం విడుదల కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తాయి అనేది తెలియాలంటే మరో వారం రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.