నాగవంశీ ఫుల్ హ్యాపీ.. కిరణ్ అబ్బవరంతో ఓ మూవీ!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా 'క' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 Nov 2024 10:06 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా 'క' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. సమ్మతమే, ఎస్ ఆర్ కళ్యాణమండపం వంటి పలు చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించారు. తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. హీరోగా తక్కువ టైమ్ లో ఎక్కువ చిత్రాలు చేశారు.
ఇప్పుడు సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన 'క' చిత్రంతో థియేటర్లలోకి దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చారు. 1970స్ బ్యాక్ డ్రాప్.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ గిరి నేపథ్యంలో రూపొందిన ఆ చిత్రంలో కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్ తో అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషన్ సీన్స్ లోనూ తనదైన నటనతో కట్టిపడేశారు. సుజీత్, సందీప్ కొత్త డైరెకర్స్ అయినా.. ఆకట్టుకున్నారు. అలా సినిమా మంచి టాక్ అందుకుని దూసుకుపోతోంది.
అయితే 'క' చిత్రంతోపాటు దుల్కర్ సల్మాన్, యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరీ జంటగా నటించిన లక్కీ భాస్కర్ కూడా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి తన కుటుంబం కోసం తీసుకున్న రిస్క్ ఆధారంగా వెంకీ అట్లూరి అద్భుతంగా తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నాగవంశీ నిర్మించారు. ఇప్పుడు ఆయన 'క' సినిమాపై లక్కీ భాస్కర్ మూవీ ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
కిరణ్ అబ్బవరం 'క' చిత్రంతో పోటీ గురించి అడగ్గా నాగవంశీ స్పందించారు. దీపావళి కానుకగా వచ్చిన లక్కీ భాస్కర్, 'క' సినిమాలను ప్రేక్షకులు మంచిగా ఆదరిస్తున్నారని తెలిపారు. కిరణ్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఏడాదిన్నర కష్టపడి కిరణ్ మంచి సినిమా తీశారని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన బాధను వ్యక్తపరిచారని అన్నారు. ప్రస్తుతం 'క' మూవీ పాజిటివ్ టాక్ అందుకుని రాణిస్తోందని తెలిపారు.
మంచి వసూళ్లు సాధిస్తుందని తెలిపారు నాగవంశీ. అందుకు తాను సంతోషించాల్సింది పోయి.. పోటీ పెట్టుకొని ఏం సాధిస్తామని అన్నారు. భవిష్యత్తులో తామిద్దరం సినిమా చేయమని ఎవరైనా చెప్పారా అని క్వశ్చన్ చేశారు. తామిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అన్నారు. దీంతో 'క' సక్సెస్ పట్ల నాగవంశీ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో వారి కాంబోలో మూవీ వచ్చేటట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.