నాగవంశీ ఫ్యామిలీ నుంచి ఓ యువ హీరో
ఇక చినబాబు సోదరుడి కొడుకు నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ తో మరింత గ్రాండ్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.
By: Tupaki Desk | 24 Jan 2025 5:59 PM GMTటాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ఆహ్వానించే ప్రక్రియ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంది. ఈసారి, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఫ్యామిలీ నుంచి ఒక హీరో రాబోతున్నాడు. హారిక హాసిని ప్రొడక్షన్ తో చినబాబు మంచి గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తో ఈ సంస్థ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మంచి క్రేజ్ అందుకుంది. ఇక చినబాబు సోదరుడి కొడుకు నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ తో మరింత గ్రాండ్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.
అప్పుడప్పుడు తన స్పీచ్ లో హాట్ టాపిక్ గా కూడా నిలుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నాగవంశీ బావమరిది హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇండస్ట్రీ జనాల మధ్య ఆసక్తిని పెంచింది. ఫిబ్రవరి 7న ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారు. నాగవంశీ, తన ప్రత్యేకమైన నిర్మాణ శైలితో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి మరో కొత్త టాలెంట్ తెరపైకి రాబోతుండటంతో అంచనాలు పెరిగాయి. ఇందుకు సంబంధించిన విశేషం ఏమిటంటే, ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాకుండా మరో ప్రముఖ నిర్మాత బెన్నీ ముప్పనేని నిర్మిస్తున్నారు. ఆయన ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
ఈ చిత్రాల విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బెన్నీ, ఈ కొత్త ప్రయత్నానికి పూర్తిగా సన్నద్ధమయ్యారు. కొత్త హీరో ఎంట్రీకు తగిన విధంగా ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త హీరోకి సంబంధించిన ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ తర్వాత సోషల్ మీడియాలో హైప్ మరింత పెరిగింది. ఇక సీతార సంస్థలో చాలా సినిమాలకు వర్క్ చేసిన రైటర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇక నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల విషయంలో తీసుకునే నిర్ణయాలు, ప్రమోషనల్ స్ట్రాటజీలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఆయన బామ్మర్ది ఎంట్రీలో నిర్మాతగా సంబంధం లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తారని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ, దర్శకుడు, టెక్నికల్ టీం, కథా అంశాలపై ముందుకు మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 7న ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్ జరుగనుందని సమాచారం. మరి మొదటి సినిమాతో నాగవంశీ బంధువు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.