బాలీవుడ్ పై నాగవంశీ సెటైర్లు.. బోనీకి స్ట్రాంగ్ కౌంటర్!
అయితే నాగవంశీ స్టేట్మెంట్ ను యాక్సెప్ట్ చేయని బోనీ కపూర్.. ఇవి మేము ఎప్పుడో చేసామని బదులిచ్చారు.
By: Tupaki Desk | 31 Dec 2024 8:21 AM GMTఇండియన్ సినిమాలో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టిన్నాయి. భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ డైరెక్టర్స్ తీస్తున్న సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి. ఇదే విషయం మీద తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ బాలీవుడ్ నిర్మాతలతో వాదించారు.
2024 చివరకు చేరుకోవడంతో గడిచిన ఏడాది కాలంలో సినీ ఇండస్ట్రీ పరిస్థితి గురించి చర్చించడానికి, ఓ మీడియా సంస్థ సౌత్ నార్త్ కు చెందిన ప్రముఖ నిర్మాతలతో రౌండ్ టేబుల్ చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో టాలీవుడ్ నుంచి నాగవంశీ పాల్గొన్నారు. హీరో సిద్ధార్థ, బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీ బాలీవుడ్ మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
బోనీ కపూర్ మాట్లాడుతూ.. "తెలుగు సినిమాలకి యూస్ లో మంచి మార్కెట్ ఉంది. తమిళ చిత్రాలకు సింగపూర్, మలేషియాలలో మార్కెట్ ఉంది" అని అన్నారు. దీనికి మధ్యలో నాగవంశీ మధ్యలో కలుగజేసుకుంటూ "మీరు ఒక్క విషయాన్ని అంగీకరించాలి. ఇది కొంచం హార్ష్ గా ఉన్నా ఇది మీరు ఒప్పుకొని తీరాలు. మా సౌత్ ఇండియన్స్ బాలీవుడ్ వాళ్లు సినిమాలు చూసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేసాం. ఎందుకంటే మీరు ఇంకా బాంద్రా, జుహు దగ్గరే స్టక్ అయిపోయారు. కానీ మేము బాహుబలి, RRR, పుష్ప, కల్కి, యానిమల్ వంటి సినిమాలు తీసాం" అని అన్నారు.
అయితే నాగవంశీ స్టేట్మెంట్ ను యాక్సెప్ట్ చేయని బోనీ కపూర్.. ఇవి మేము ఎప్పుడో చేసామని బదులిచ్చారు. దీంతో వెంటనే "మీరు ఇంతకముందు 'మొఘల్ ఏ ఆజమ్' మూవీ తర్వాత తెలుగు సినిమాలైన బాహుబలి, RRR లను ప్రస్తావించారు. ఒక్క హిందీ సినిమా పేరు కూడా చెప్పలేదు" అని కౌంటర్ ఇచ్చారు. గత 3-4 ఏళ్లలో మాస్ చిత్రాలు, ఈవెంట్ ఫిలింస్ తో ఇండియన్ సినిమాని మేము రీడిస్కవర్ చేశామని అన్నారు.
"బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, యానిమల్.. ఇవన్నీ సౌత్ నుంచి వచ్చి హిందీలో భారీ కలెక్షన్స్ రాబట్టాయి" అని నాగవంశీ పేర్కొన్నారు. దీంతో గదర్-2, పఠాన్, జవాన్ వంటి హిందీ సినిమాలను మర్చిపోయావ్ అని బోనీ కపూర్ అనగా.. 'జవాన్' మా సౌత్ డైరెక్టర్ తీసిన సినిమానే అని వంశీ మళ్ళీ కౌంటర్ వేసాడు. "పుష్ప-2 సినిమా హిందీలో ఒక్క రోజులోనే ₹86 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు మీ ముంబై వాళ్ళకి నిద్ర పట్టి ఉండదు" అని సెటైరికల్ గా మాట్లాడాడు.
నాగవంశీ, బోనీ కపూర్ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగానే వంశీ ఇంటర్వ్యూలలో యాటిట్యూడ్ తో మాట్లాడతారని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. ఇప్పుడు బోనీ లాంటి బడా బాలీవుడ్ నిర్మాతకు కౌంటర్ ఇవ్వడంతో తెలుగు సినీ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బోనీ యాక్సెప్ట్ చేయనప్పటికీ, వంశీ చెప్పింది నిజమేనని వ్యాఖ్యానిస్తున్నారు. 'పుష్ప 2' లాంటి తెలుగు డబ్బింగ్ మూవీ ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.