బోనీ సార్ ని తక్కువ చేయలేదు.. అలాంటి అభిప్రాయానికి రావొద్దు..!
ముఖ్యంగా తెలుగు సినిమాలే పాన్ ఇండియా లెవెల్ లో హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తా చాటుతున్నాయి.
By: Tupaki Desk | 31 Dec 2024 3:20 PM GMTఇండియన్ సినిమా లో ప్రస్తుతం సౌత్ సినిమాలే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలే పాన్ ఇండియా లెవెల్ లో హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తా చాటుతున్నాయి. ఇదే విషయాన్ని కాస్త గట్టిగా చెప్పారు ప్రముఖ తెలుగు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. రీసెంట్ గా ఒక మీడియా సంస్థ సౌత్ నార్త్ నిర్మాతలతో ఒక స్పెషల్ చిట్ చాట్ ఏర్పాటు చేయగా అందులో భాగంగా నాగ వంశీ బాలీవుడ్ వాళ్లు కూడా సినిమాలు చూసే విధానాన్ని పూర్తిగా మార్చేశామని అన్నారు. మీరు బాంద్రా, జుహు దగ్గర ఉంటే మేము బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, పుష్ప, కల్కి, యానిమల్ చేశామని అన్నారు.
నాగ వంశీ మాటలను బోని కపూర్ యాక్సెప్ట్ చేయలేదు. ఇలాంటివి మేము ఎప్పుడో చేశామని ఆయన అన్నారు. ఐతే నాగ వంశీ మీరు మొఘల్ ఏ ఆజం తర్వాత బాహుబలి, RRR ల గురించి ప్రస్తావించారు కానీ ఒక్క హిందీ పేరు చెప్పలేదని అన్నారు. ఐతే ఈ డిస్కషన్ లో నాగ వంశీ చేసిన కామెంట్స్ బాలీవుడ్ ఆడియన్స్ కి రుచించలేదు. ముఖ్యంగా ముంబై మీడియా దీన్ని తప్పుగా చిత్రీకరించి చూపిస్తుంది.
ఇందులో భాగంగానే బాలీవుడ్ కి చెందిన కొందరు నాగ వంశీ ఆ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోనీ కపూర్ తో అలా మాట్లాడి ఉండకూడదని ఎక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి నాగ వంశీ తన ఎక్స్ లో క్లారిటీ ఇచ్చారు. పెద్ద వాళ్లకు ఎలా గౌరవించాలి అన్నది నాకు మీరు చెప్పాల్సిన పనిలేదు. మేము బోనీని మీ కన్నా ఎక్కువ గౌరవిస్తాం.. ఆయన్ను ఎక్కడ అగౌరవపరచలేదు. అదంతా మంచి హెల్దీగా జరిగిన కన్వర్జేషన్. బోనీ సర్ నేను ఆ తర్వాత చాలా నవ్వుకున్నాం హగ్ కూడా చేసుకున్నాం. మీరు ఇలాంటి విషయాల్లో త్వరగా ఒక నిర్ణయానికి రావొద్దు అని తాను చేసిన కామెంట్స్ అన్ని ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడినవే తప్ప ఎవరినె అగౌరపరచలేదని నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.
మాములుగానే ఈ యువ నిర్మాత కాస్త దూకుడుగా ఉంటాడన్న టాక్ ఉంది. ఐతే పాయింట్ మాట్లాడేప్పుడు అక్కడ ఉన్నది ఎవరైనా మన సౌత్ సినిమాల గురించి అదే తెలుగు సినిమాలు సాధిస్తున్న విజయాల గురించి గట్టిగానే వాధించాల్సి ఉంటుంది. అంతేతప్ప దానికి అవతల వ్యక్తి మీద రెస్పెక్ట్ లేదన్నట్టు కాదు. ఐతే ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ మాత్రం నాగ వంశీకే సపోర్ట్ చేస్తున్నారు.