బాలయ్య డాకు.. నాగవంశీ చెప్పినట్లే ఉంటుందా?
అదే సమయంలో తమ బ్యానర్ పై రూపొందే చిత్రాల అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు ఇస్తుంటారాయన.
By: Tupaki Desk | 5 Jan 2025 6:50 AM GMTటాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత అయిన ఆయన.. వరుస సినిమాలు రూపొందిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. లైనప్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను చేర్చుతున్నారు. అదే సమయంలో తమ బ్యానర్ పై రూపొందే చిత్రాల అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు ఇస్తుంటారాయన.
వాటితోపాటు సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు నాగవంశీ. మూవీపై ఆడియన్స్ లో వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ విషయంలో కూడా అదే చేస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్ సృష్టిస్తున్నారనే చెప్పాలి.
కొద్ది రోజుల క్రితం చిరంజీవితో చేసిన సినిమా కన్నా.. డాకు మహారాజ్ ను డైరెక్టర్ బాబీ కొల్లి బాగా తీశారని తెలిపారు. చిరు ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదని అన్నారు. అయితే చిరంజీవితో బాబీ.. వాల్తేరు వీరయ్య మూవీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ గురించి చెప్పి నందమూరి ఆడియన్స్ లో ఉన్న అంచనాలను పెంచారు.
ఇంటర్వెల్ సీక్వెన్స్ సమయంలో 20 నిమిషాల పాటు ఆడియన్స్ అస్సలు సీట్లలో కూర్చోరని, వేరే లెవెల్ లో సీన్ ఉంటుందని తెలిపారు. నాన్ స్టాప్ గా పేపర్లు విసురుతూనే ఉంటారని అన్నారు. రీసెంట్ గా సమరసింహారెడ్డిలో బాలయ్య గొడ్డలి పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇది గుర్తుందా అంటూ పోస్ట్ పెట్టారు.
అసలు సిసలైన మాస్ సినిమా ఏంటో చూపించిన సీక్వెన్స్ ఇది.. నా మాటలు గుర్తుపెట్టుకోండి.. డాకు మహారాజ్ సెకండాఫ్ లో కూడా ఇలాంటి సీన్ ఉంది. అది చూస్తే మీరు మళ్లీ పిచ్చెక్కి.. అప్పటి రోజులకు వెళ్లిపోతారు. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు. మీరే చూద్దురు గాని వెయిట్ చేయండి అంటూ నాగవంశీ రాసుకొచ్చారు.
దీంతో డాకు మహారాజ్ సెకండాఫ్ లో సూపర్ సీన్ ఉండనుందని క్లియర్ గా తెలుస్తోంది. అభిమానులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అర్థమవుతోంది. మొత్తానికి సినిమాకు సంబంధించిన వివిధ విషయాలు షేర్ చేసుకుంటూ ఆసక్తి రేపుతున్నారు. అయితే సినిమాల విషయంలో నాగ వంశీ కామెంట్స్ కు క్రెడిబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు జాతిరత్నాలు విషయంలో అదే జరిగింది. మరి ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.