Begin typing your search above and press return to search.

జ‌న‌వ‌రి 2న అమెరికాలో...8న ఆంధ్రాలో డాకు మ‌హారాజ్ రచ్చ‌

తాజాగా డాకు మ‌హారాజు ప్రెస్ మీట్ లో ఎక్క‌డెక్క‌డ ఈవెంట్లు నిర్వహిస్తున్నారన్న‌ది నిర్మాత నాగ‌వంశీ రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 7:38 AM GMT
జ‌న‌వ‌రి 2న అమెరికాలో...8న ఆంధ్రాలో డాకు మ‌హారాజ్ రచ్చ‌
X

గాడ్ ఆఫ్ మాసెస్ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌వంశీ నిర్మాణంలో 'డాకు మ‌హారాజ్' తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. అయితే ఇంత వ‌ర‌కూ ప్ర‌చారం ప‌నులు మొద‌ల‌వ్వ‌లేదు. ప్ర‌చారం ఆల‌స్య‌మైనా పీక్స్ లోనే ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా డాకు మ‌హారాజు ప్రెస్ మీట్ లో ఎక్క‌డెక్క‌డ ఈవెంట్లు నిర్వహిస్తున్నారన్న‌ది నిర్మాత నాగ‌వంశీ రివీల్ చేసారు.

ఆ సంగ‌తులు ఆయ‌న మాట‌ల్లోనే..' జ‌న‌వ‌రి 2న ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్నాం. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం. అటుపై జ‌న‌వ‌రి 8న ఆంధ్రాలోని విజ‌య‌వాడ‌-మంగ‌ళ‌గిరి ప్రాంతంలో అభిమానుల స‌మ‌క్షంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అలాగే సినిమాకి ఎలాంటి పెయిడ్ ప్రీమియ‌ర్లు లేవు. గ‌తంలో అనుకున్న ప్రకార‌మే ముందుకెళ్తున్నాము. తెల్ల‌వారు నాలుగు గంట‌ల‌కు తొలి షో ప‌డుతుంది.

థ‌మ‌న్ మాకు సినిమాను ఫస్ట్ హాఫ్ వ‌ర‌కూ సినిమా చూపించాడు. చాలా పెద్ద సినిమా అవుతుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. బాల‌కృష్ణ గారు గ‌త 20, 30 ఇలాంటి విజువ‌ల్స్ లో చూసి ఉండరు. బాల‌కృష్ణ గారిని నేను ఎలా చూడాల నుకున్నా? అలా సినిమాలో చూస్తున్నాం. జైల‌ర్ సినిమా చూసిన త‌ర్వాత ఓ హీరోని ఇలా కూడా చూపించొచ్చా? అనిపించింది.

అప్ప‌టి నుంచి నాకు హీరోని తెర‌పై అలా చూపించాల‌నే ఆశ క‌ల‌గింది. బాల‌య్య గారిని మాస్ తో పాటు అందంగానూ చూపించాం. 'డాకు మ‌హారాజు' అలాగే ఉంటుంది. సినిమాపై చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం. సినిమా స‌క్సెస్ ఎక్క‌డ ఆగుతుందో గెస్ చేయ‌లేను. షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొత్తం పూర్త‌య్యాయి.' అని అన్నారు.