ఫుడ్ విషయంలో పవన్ సైలెంట్ నిరసన
ఆయన సరిగ్గా నిలదొక్కుకుని మంచి హీరోగా ప్రూవ్ చేసుకుని తర్వాత తన ఫ్యామిలీని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు.
By: Tupaki Desk | 8 March 2025 8:00 PM ISTటాలీవుడ్ లోని ఫ్యామిలీల్లో మెగా ఫ్యామిలీ చాలా పెద్దది. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే ఇండస్ట్రీలో దాదాపు పది మంది నటులున్నారు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి మొదటిగా ఇండస్ట్రీకి వచ్చింది మాత్రం చిరంజీవినే. ఆయన సరిగ్గా నిలదొక్కుకుని మంచి హీరోగా ప్రూవ్ చేసుకుని తర్వాత తన ఫ్యామిలీని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు.
మెగాస్టార్ గా ఆయన ఇండస్ట్రీని రూల్ చేశారు. తర్వాత చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా పేరొందడమే కాకుండా ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎంగా ఎన్నికై, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి మరో తమ్ముడు నాగబాబు ముందు నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తర్వాత నిర్మాతగా మారారు.
ప్రస్తుతం ఆయన కూడా తమ్ముడు పవన్ పెట్టిన జనసేన పార్టీ కార్యకలాపాలన్నింటినీ చూసుకుంటూ రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తూ ఓ చిట్ చాట్ లాగా నిర్వహించి ఆ వీడియోను రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, నాగబాబు, వారి తల్లి అంజనాదేవితో పాటూ చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి కూడా పాల్గొని చిన్నప్పటి విషయాలను షేర్ చేసుకున్నారు.
అయితే ఈ చిట్ చాట్ లో నాగబాబు, తన చిన్ననాటి రోజుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. చిన్నతనంలో తాను ఎక్కువగా పని చేసేవాడిని కాదని, అన్ని పనులు అన్నయ్యే చేసేవారని, తనకు చెప్పిన పనుల్ని కూడా అన్నయ్యతోనే చేయించేవాడనని చెప్పిన ఆయన, కొన్నిసార్లు అన్నయ్య చేతిలో దెబ్బలు కూడా తిన్నానని తెలిపారు.
తమ్ముడు పవన్ గురించి చెప్తూ నాగబాబు ఆసక్తికర విషయాలను తెలియచేశారు. కళ్యాణ్ బాబు చిన్నప్పుడు చాలా వీక్ గా ఉండేవాడని, అందుకే అమ్మ తనపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేదని, తిండి విషయంలో అన్నయ్య ఏం పెట్టినా సైలెంట్ గా తింటే, తాను మాత్రం ఇంట్లో అల్లరి చేసేవాడినని, కళ్యాణ్ బాబు నచ్చితే తినేవాడు, నచ్చకపోతే సైలెంట్ గా వెళ్లిపోయేవాడని, తన నిరసనను కూడా కళ్యాణ్ బాబు సైలెంట్ గానే తెలిపేవాడని నాగబాబు తెలిపారు. ఆ అలవాటుతోనే ఇప్పటికీ కళ్యాణ్ బాబు వస్తున్నాడంటే ఇష్టమైన వంటలన్నీ తన తల్లి వండుతుంటుందని తెలిపారు నాగబాబు.