ఆ విషయంలో మహేష్ కు పోటీనే లేదు: నాగబాబు
హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Feb 2025 6:54 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీని చేస్తున్న మహేష్ బాబు, ఈ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
సౌత్ ఇండియా స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్న మహేష్ అందానికి ఫిదా అవని వారు ఉండరు. ఆయన అందం, సింప్లిసిటీతో పాటూ తను చేసే సామాజిక సేవ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్న మహేష్ బాబు గురించి చిరంజీవి తమ్ముడు నాగబాబు రీసెంట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా నాగబాబు మహేష్ క్రేజ్ గురించి మాట్లాడాడు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సమానంగా ఇండస్ట్రీలో ఎవరైనా హీరో ఉన్నారా అంటే అది మహేషేనని, తనకు ఉన్నంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు ఉండదని, ఇంకా చెప్పాలంటే అందం పరంగా మహేష్ బాబు తో పోటీ పడే వాళ్లు లేరని నాగ బాబు అన్నాడు.
తన భార్య కూడా మహేష్ బాబు కు చాలా పెద్ద ఫ్యాన్ అని, మహేష్ ను తమ్ముడిగా ఫీలవుతూ ఉంటుందని నాగబాబు తెలిపాడు. మహేష్ చిన్నప్పుడు బాగా బొద్దుగా ఉండేవాడని, తన లుక్స్ మార్చుకోవడానికి మహేష్ ఎంత కష్టపడేవాడో తనకు తెలుసని, సన్నగా అవడం కోసం రోజూ కేబీఆర్ పార్క్ లో మహేష్ విపరీతంగా పరిగెత్తేవాడని, అనుకున్నది సాధించే వరకు మహేష్ నిద్రకూడా పోడని, మహేష్ లోని ఆ క్వాలిటీ తనకెంతో నచ్చుతుందని నాగబాబు చెప్పాడు.
ఇక నాగబాబు విషయానికొస్తే, చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నాగబాబు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించాడు. కానీ ఆ సినిమాలేవీ ఆయనకు అనుకున్నంత లాభాలను తెచ్చిపెట్టలేక పోయాయి. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నాగ బాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ చాలా బిజీగా ఉంటున్నాడు.