Begin typing your search above and press return to search.

యాండ‌మూరి కి ఛాన్స్ ఇవ్వ‌డంపై నాగ‌బాబు ఏమంటారో?

చిరు క‌థ‌ని రాసే అవ‌కాశం యండ‌మూరికి ఇవ్వ‌డం ప‌ట్ల నాగ‌బాబు స్పంద‌న ఎలా ఉంటుందని ఓ సెక్ష‌న్ అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 4:30 PM GMT
యాండ‌మూరి కి ఛాన్స్ ఇవ్వ‌డంపై నాగ‌బాబు ఏమంటారో?
X

మెగాస్టార్ చిరంజీవి జీవిత క‌థ‌ని పుస్త‌క రూపంలో తీసుకొచ్చే అవ‌కాశం ప్ర‌ముఖ ర‌చ‌యిత యంద‌మూరి విరేంద్ర‌నాధ్ కి అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. విశాఖ వేదిక‌గా చిరంజీవి ఈ ప్ర‌క‌ట‌న చేసారు. దీంతో అంతా ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. గ‌తంలో చిరంజీవి న‌టించిన ఎన్నో సినిమాలు యండ‌మూరి న‌వ‌లలు ఆధారంగానే తెర‌కెక్కించారు. నేడు మెగాస్టార్ గా కీర్తింప‌డుతున్నారంటే కార‌ణంగా ఆయ‌న క‌థ‌లే. మెగాస్టార్ అనే బిరుదు కూడా యండ‌మూరినే ఇచ్చారు.

ఇలా చిరంజీవి-యండ‌మూరి మ‌ధ్య ఎంతో గొప్ప స్నేహ‌సంబంధం ఉంది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని వివాదాస్ప‌ద‌మైన అంశాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ వీటిపై ఏనాడు చిరంజీవి మీడియా ముందు కొచ్చి మాట్లాంది లేదు గానీ...మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మాత్రం ప‌బ్లిక్ గానే యండ‌మూరిని పేరు పెట్ట‌కుండా ఓ వేదిక‌పై విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత యండ‌మూరి సైతం చిరంజీవి న‌టించిన సినిమాల విష‌యంలో వివాదాస్ప‌ద‌మైన కామెంట్లు చేసారు.

కానీ అటుపై నాగ‌బాబు మాత్రం మౌనం వ‌హించారు. స‌రిగ్గా ఇదేస‌మ‌యంలో చిరంజీవి ఆత్మ‌క‌థ‌ని రాసే అవ‌కాశం ఇవ్వ‌డం యండ‌మూరి గొప్ప అవ‌కాశం గా భావించి...చిరంజీవి త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌న్నారు. చిరంజీవి ఈ విష‌యాన్ని ఎంతో సంతోషంగా స్వాగ‌తించారు. అయితే నాగ‌బాబు మాత్రం ఇంకా లైన్ లోకి రాలేదు. చిరు క‌థ‌ని రాసే అవ‌కాశం యండ‌మూరికి ఇవ్వ‌డం ప‌ట్ల నాగ‌బాబు స్పంద‌న ఎలా ఉంటుందని ఓ సెక్ష‌న్ అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు.

అస‌లు ఆయ‌న స్పందిస్తాడా? సైలెంట్ గా ఉంటాడా? అని మరికొంత అభిప్రాయ‌ప‌డుతున్నారు. నాగ‌బాబు కొన్ని నెల‌లుగా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాప‌ల్లోనూ చురుగ్గా పాల్గొన్న‌ట్లు క‌నిపించ‌లేదు. అంత‌కు ముందు జ‌న‌సేన పార్టీని విమ‌ర్శిస్తే వెంట‌నే లైన్ లోకి కౌంట‌ర్ వేసేవారు. కానీ ఇప్పుడా స‌న్నివేశం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.