Begin typing your search above and press return to search.

వీడియో: నిధి వేట‌ నాగ‌దేవ‌త‌పై రేర్ VFX మూవీ

మ‌ధుసూధ‌న‌రావు స‌హ‌కారంతో అభిషేక్ పిక్చర్స్- థండర్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి

By:  Tupaki Desk   |   9 April 2024 10:02 AM GMT
వీడియో: నిధి వేట‌ నాగ‌దేవ‌త‌పై రేర్ VFX మూవీ
X

అభిషేక్ నామా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సంచలనాల‌కు పర్యాయంగా మారింది ఈ పేరు. గూఢ‌చారి, డెవిల్ వంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలను నిర్మించి పంపిణీ చేసిన ఆయ‌న‌ ఇప్పుడు మ‌రో సాహ‌సానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సారి నాగ‌దేవ‌తల క‌థ‌లు, పురాణేతిహాసాలలోని అద్భుత‌ క‌థ‌ల‌ను ఇష్ట‌ప‌డే వారిని మంత్రముగ్ధులను చేసే ప్ర‌య‌త్నానికి శ్రీ‌కారం చుట్టారు. మ‌ధుసూధ‌న‌రావు స‌హ‌కారంతో అభిషేక్ పిక్చర్స్- థండర్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి.

`డెవిల్`తో ద‌ర్శ‌కుడిగా మారిన‌ అభిషేక్ నామా ఇప్పుడు ఆధ్యాత్మికత థ్రిల్లింగ్ అడ్వెంచ‌ర‌స్ అంశాలతో అల్లిన అద్భుతమైన స్క్రిప్ట్‌తో మరోసారి దర్శకుడిగా నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అభిషేక్ నామా పాన్ ఇండియా సినిమాకి పవర్ ఫుల్ గా `నాగబంధం` అనే టైటిల్ పెట్టారు. ఉగాది శుభ సందర్భంగా, అభిషేక్ పిక్చర్స్ త‌మ‌ స్మారక వెంచర్ టైటిల్‌ ను ప్ర‌క‌టించారు. ది సీక్రెట్ ట్రెజర్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ టీజ‌ర్ ని ఆవిష్కరించారు. టీజర్ ఆద్యంతం మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆక‌ట్టుకుంది. టైటిల్ గ్లింప్స్ లో టైటిల్ కి త‌గ్గ‌ట్టే నాగుపాముల విలాసం గ‌గుర్పాటుకు గురి చేస్తుండ‌గా, మంత్రముగ్దులను చేసే సౌండ్‌ట్రాక్ .. ఉత్కంఠభరితమైన విజువల్స్ తో టీజ‌ర్ ని తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంది. VFX వ‌ర్క్ దృశ్య వైభవాన్ని మరింత మెరుగుపరిచింది. ఎంచుకున్న క‌థ‌, కథనం ఆధ్యాత్మికలోకి ప్రేక్షకులను లీనం చేస్తుంది.

KGF ఫేమ్ అవినాష్ ఇందులో అఘోరి పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. విష్ణువు దాచిన నిధిని వెతకడానికి ఎలాంటి అన్వేష‌ణ సాగింది? అన్న‌ది థ్రిల్లింగ్ గా చూపించ‌నున్నార‌ని తెలిసింది. దేవాన్ష్ నామా సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, దేవ్ బాబు గాండి (బుజ్జి) సహ-నిర్మాతగా పనిచేస్తున్నారు. అత్యుత్త‌మ సాంకేతిక నిపుణుల‌తో అభిషేక్ ప‌ని చేయ‌నున్నారు. సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నుండ‌గా, అభే సంగీతం అందించ‌నున్నారు. మిస్టరీ అండ్ అడ్వెంచర్ ప్రపంచంలోకి ప్ర‌జ‌ల్ని లీనం చేసే క‌థాంశంతో ఇది రూపొందుతోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తుండ‌గా, సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ వ‌ర్క్ చేయ‌నున్నారు.

నాగబంధం పాన్-ఇండియా స్థాయిలో విడుద‌ల‌వుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 2025లో ఒకేసారి విడుదల కానుంది. ఒక అద్భుత‌మైన విజువ‌ల్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించేందుకు అభిషేక్ నామా చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది.