Begin typing your search above and press return to search.

వారం ముందే చైతూ, శోభిత పెళ్లి తంతు షురూ

నాగచైతన్య, శోభితల వివాహం డిసెంబర్ 4వ తారీకున అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్నేహితులు, సన్నిహితుల మధ్య జరగనున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   29 Nov 2024 4:31 AM GMT
వారం ముందే చైతూ, శోభిత పెళ్లి తంతు షురూ
X

నాగచైతన్య, శోభితల వివాహం డిసెంబర్ 4వ తారీకున అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్నేహితులు, సన్నిహితుల మధ్య జరగనున్న విషయం తెల్సిందే. ఏయన్నార్‌ గారి విగ్రహం సాక్షిగా ఈ జంట ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అంటూ ఇటీవల అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చింది. పెళ్లికి ఇంకా వారం రోజుల సమయం ఉండగానే పెళ్లి తంతు మొదలు పెట్టినట్టు ఫ్యామిలీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పెళ్లిలో అతి ముఖ్యమైన మొదటి ఘట్టం హల్దీ వేడుకను ఇరు ఫ్యామిలీలు పూర్తి చేయడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ వేడుక జరిగింది.

కాబోయే వధూవరులకు ఒకే చోట మంగళ స్థానాలు చేయించడం జరిగింది. మంగళ స్థానాల కార్యక్రమంలో ఇరు కుటుంబాల స్నేహితులు, బంధు మిత్రులు హాజరు అయ్యారు. సాధారణంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు మంగళ స్థానాలు వేరు వేరుగా చేయిస్తారు. కానీ నాగ చైతన్య, శోభితలకు మాత్రం మంగళ స్థానాలు ఒకే చోట, ఒకే రోజు చేయించడం జరిగింది. ఇది వారి సాంప్రదాయామా లేదంటే పెళ్లి తంతు స్ట్రీమింగ్‌ రైట్స్ ఓటీటీ వారికి ఇచ్చారు కనుక షూటింగ్‌కి అనుకూలంగా ఉంటుందని, సినిమాటిక్‌గా ఉంటుందని భావిస్తున్నారా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

శోభిత, నాగ చైతన్యల పెళ్లి తంతు మొదలు అయిందని మంగళ స్థానాల వీడియోలు, ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి ఇంకా సమయం ఉండగానే మంగళ స్థానాలు పూర్తి చేశారు కనుక రాబోయే రోజులన్నీ ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం, పెళ్లి తంతు జరుగుతూనే ఉంటుంది. హిందూ బ్రాహ్మణ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి వేడుక జరుగుతుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని భావించినప్పటికీ మంగళ స్నానాలకు సంబంధించిన ఫోటోలు అప్పుడే బయటకు వచ్చాయి. ముందు ముందు పెళ్లి తంతు ఫోటోలు, వీడియోలు లీక్‌ కాకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి.

నాగ చైతన్య తండేల్‌ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించినా సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ఉన్న కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో సినిమాను విడుదల చేయబోతున్నారు. తండేల్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అరవింద్‌ సమర్పణలో చందు మొండేటి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అనేది తెలియాలి అంటే ఫిబ్రవరి వరకు వెయిట్‌ చేయాల్సిందే.