Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : మరోసారి వైరల్‌గా కొత్త జంట

తాజాగా మరోసారి వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తెగ వైరల్‌ అవుతోంది. అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 March 2025 11:54 AM IST
పిక్‌టాక్ : మరోసారి వైరల్‌గా కొత్త జంట
X

అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం గత ఏడాది డిసెంబర్‌ 4న వైభవంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలోని ఏఎన్నార్ విగ్రహం ముందు ఇరు కుటుంబాల సమక్షంలో ఈ వివాహం జరిగింది. చైతూ, శోభితల వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్‌ మీడియాలో దాదాపు రెండు వారాల పాటు వైరల్‌ అయ్యాయి. పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమాలు, పెళ్లి తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇలా ప్రతి సందర్భంలోనూ వీరిద్దరి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరోసారి వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తెగ వైరల్‌ అవుతోంది. అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు.


నాగ చైతన్య, శోభిత చివరిసారిగా తండేల్‌ సినిమా ఈవెంట్‌ సందర్భంగా కనిపించారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సైతం వైరల్‌ అయ్యాయి. తాజాగా మరోసారి వీరిద్దరు ఒకే ఫ్రేమ్‌ లో కనిపించారు. ఇటీవలే తండేల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న నాగ చైతన్య విజయానందం లో ఉన్నారు. త్వరలోనే చైతూ కొత్త సినిమా షూటింగ్‌కి జాయిన్‌ కాబోతున్నారు. అంతకు ముందు భార్య శోభితతో కలిసి విదేశాలకు హాలీడే ట్రిప్‌కి వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ సింపుల్‌గా నాగ చైతన్య, శోభిత ఇలా కూర్చుని తింటున్న ఫోటోలను క్లిక్‌ అనిపించారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది.


స్టైలిష్ లుక్‌లో నాగ చైతన్య కనిపించగా, శోభిత సింప్లీ సూపర్‌ అన్నట్లుగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇద్దరి జోడీ చూడ చక్కగా ఉందని, వీరిద్దరూ కలకాలం సంతోషంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటూ పలువురు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. నాగ చైతన్య, శోభిత జోడీని ఇలా చూసిన వారిలో చాలా మంది వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పట్లో వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే శోభిత ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అక్కడ సినిమాలు, సిరీస్‌ల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.


నాగ చైతన్య తండేల్‌ సినిమాతో మొదటి సారి వంద కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లో చేరిన నేపథ్యంలో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే చైతూతో కార్తీక్ వర్మ దండు ఒక సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందబోతున్న ఈ సినిమాను నిర్మించబోతున్నారు. నాగ చైతన్యకు కథ బాగా నచ్చడంతో మరోసారి ఏడాది టైం కేటాయించేందుకు ఓకే చెప్పాడట. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతున్నట్లు సమాచారం అందుతోంది. తండేల్‌ తర్వాత మరో వంద కోట్ల సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కార్తీక్ వర్మ దండు ఆ ఎదురుచూపులకు తెర దించేనా చూడాలి.