నాగ చైతన్య, శోభిత పెళ్లి ఎప్పుడంటే?
ఇదిలా ఉంటే తాజాగా శోభిత దూళిపాళ్ల తన పెళ్లి పనులకి సంబందించిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
By: Tupaki Desk | 22 Oct 2024 7:31 AM GMTఅక్కినేని యువ హీరో నాగ చైతన్య, బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లకి కొద్ది నెలల క్రితం ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా శోభిత దూళిపాళ్ల తన పెళ్లి పనులకి సంబందించిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో వారి పెళ్లి హడావిడి మొదలైందనే మాట వినిపిస్తోంది. ప్రీ వెడ్డింగ్ పనులని రెండు కుటుంబాల వారు ఆరంభించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే వీరిద్దరి పెళ్లి డిసెంబర్ లో జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. ముహూర్తం ఫిక్స్ చేశారని, త్వరలో అఫీషియల్ వెడ్డింగ్ డేట్ ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతోందా లేదంటే హైదరాబాద్ లోనే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీ షూటింగ్ లో ఉన్నారు.
డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. కానీ సినిమా పనులు అప్పటివరకు ఫినిష్ అయ్యేలా లేవు. అందుకే సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక నాగ చైతన్య కూడా గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమాని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. మరల పెళ్లి కోసం షూటింగ్ వాయిదా వేస్తే రిలీజ్ ఆలస్యం అవుతుంది. అందుకే పెళ్లి డేట్ లోపు మూవీ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారంట. నాగ చైతన్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ‘తండేల్’ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది.
బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది. ఇక శోభిత దూళిపాళ్ల కూడా ప్రస్తుతం ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టిందని తెలుస్తోంది. చివరిగా ఆమె ‘లవ్ సితార’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు. ఇక అక్కినేని ఇంటికి కోడలిగా రాబోతున్న నేపథ్యంలో శోభిత దూళిపాళ్ల తెలుగు సినిమాలు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పెళ్లి తర్వాత నాగ చైతన్య కొత్త ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయంట. వీటిలో ఏదో ఒకటి వచ్చే ఏడాది ఎనౌన్స్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. అలాగే శోభితకు జోడిగా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.