KA ఈవెంట్.. ట్రోలర్స్ కు నాగచైతన్య స్ట్రాంగ్ కౌంటర్
ఇదిలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
By: Tupaki Desk | 30 Oct 2024 4:15 AM GMTసోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఇప్పుడు సెలబ్రేటీలకి అత్యంత ఇబ్బందికరంగా మారుతుంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం. సినిమాలను లక్ష్యంగా చేసుకొని ముందుగానే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ట్రోలర్స్ ఒక రకమైన ద్వేషాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎక్కువగా సినీ రంగంలో ఉన్నవారే ట్రోలింగ్ బాధితులుగా మారుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
ఈ ఈవెంట్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం జర్నీకి నేను పెద్ద ఫ్యాన్ అంటూ ప్రశంసించారు. అలాగే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వారి పైన విమర్శలు చేశారు. బెంగళూరులో కార్స్ రేసింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ కిరణ్ అబ్బవరం కనిపించారు. నిజానికి నేను ఇంట్రవర్ట్. ఎవరితో అంత వేగంగా కలవలేను. అయితే అక్కడ కిరణ్ తో మాట్లాడిన తర్వాత చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది.
అందుకే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నన్ను ఇన్వైట్ చేయగానే కిరణ్ ని ప్రోత్సహించడం నా బాధ్యత అనిపించి వచ్చాను. నేను ఇండస్ట్రీ లోకి బ్యాగ్రౌండ్ తో చాలా ప్రొటెక్షన్ మధ్య వచ్చాను. అయితే కిరణ్ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ లాంటి లైఫ్ నేను చూడలేదు. అందుకే అతని లైఫ్ జర్నీకి నేను పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను.
ఈరోజు ఇండస్ట్రీలో కిరణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గతంలో అతని ఇంటర్వ్యూలు చూసాను. అందులో అవమానకరంగా, ర్యాగింగ్ చేసినట్లు ప్రశ్నించిన కూడా చాలా బ్యాలెన్స్ గా కిరణ్ వారికి సమాధానం చెప్పాడు. కిరణ్ తన మదర్ గురించి చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ప్రతి మగాడి విజయం వెనుక కచ్చితంగా ఆడవారు ఉంటారని అంటారు.
కిరణ్ సక్సెస్ జర్నీలో కూడా అతని తల్లి, ఇప్పుడు రహస్య ఉన్నారు. ట్రోలింగ్ చేసేవారి బుర్రలో ఏమీ ఉండదు. వాళ్ల చేతిలో కీబోర్డ్ లేదంటే మొబైల్ టచ్ ఉంటే ఏమైనా చేసేయొచ్చు అనుకుంటారు. వారికి నచ్చింది రాసేస్తూ ఉంటారు. అసలు అలాంటి వారిని కేర్ చేయకూడదు. కచ్చితంగా ‘క’ మూవీ మంచి సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి గుర్తింపు తీసుకొస్తుంది అని నాగచైతన్య మాట్లాడారు.