Begin typing your search above and press return to search.

ఫుల్ ఫ్యామిలీతో చైతూ, శోభిత.. వ్వాటే క్యూట్ మూమెంట్స్

శోభిత, నాగ చైతన్య ఒకటి కాబోతున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

By:  Tupaki Desk   |   10 Aug 2024 5:07 AM GMT
ఫుల్ ఫ్యామిలీతో చైతూ, శోభిత.. వ్వాటే క్యూట్ మూమెంట్స్
X

అక్కినేని ఫ్యామిలీలో త్వరలోనే మరో వేడుక జరగబోతోంది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత హీరో నాగ చైతన్య చాలా కాలం నుంచి శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఏడడుగులు నడవడానికి సిద్ధమయ్యారు. గురువారం వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అక్కినేని నాగార్జున నాగ చైతన్య, శోభితతో కలిసి ఫోటో దిగి వారిద్దరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.


శోభిత, నాగ చైతన్య ఒకటి కాబోతున్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఇదిలా ఉంటే ఈ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో నాగ చైతన్య, శోభిత న్యూస్ వైరల్ అవుతోంది. వారిద్దరి ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. సెలబ్రెటీలు కూడా నాగ చైతన్య, శోభిత దూళిపాళ్లకి విషెస్ చెబుతున్నారు.


మరోవైపు శోభిత చైతు గత పోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో నాగార్జున, అమలతో పాటుగా కొత్త జంట నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల, అఖిల్ ఉన్నారు. వీరందరూ హ్యాపీగా కలిసి దిగిన ఈ ఫోటోని ఫ్యాన్స్ ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్నారు.


ఇందులో ఫ్యామిలీ అందరూ చాలా సంతోషంగాఎంగేజ్మెంట్ వేడుక చేసినట్లు కనిపిస్తోంది. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని నాగార్జున ఒక ఇంగ్లీష్ న్యూస్ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో చెప్పినట్లు టాక్ నడుస్తోంది. నాగ చైతన్య, శోభిత పెళ్లితో మరల చైతూ జీవితంలోకి ఆనందం వస్తున్నట్లే కింగ్ నాగార్జున భావిస్తున్నారు. పెళ్ళికి మరికొంత సమయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది కంప్లీట్ అయ్యాక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసే అవకాశం ఉందంట. అయితే చైతన్య, శోభిత పెళ్లి వేడుక ఎలా జరగబోతోందనేది మాత్రం క్లారిటీ లేదు. శోభిత కూడా ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. అక్కినేని ఫ్యాన్స్ అయితే చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ పై చాలా హ్యాపీగా ఉన్నారు.