Begin typing your search above and press return to search.

అక్కినేని జంట.. ఈ విషయం మీకు తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి త్వరలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Aug 2024 11:30 AM GMT
అక్కినేని జంట.. ఈ విషయం మీకు తెలుసా?
X

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి త్వరలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ సింపుల్ గా నాగార్జున నివాసంలో జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి తక్కువ మంది సభ్యులతోపాటు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. చై, శోభిత ఎంగేజ్మెంట్ పిక్స్.. నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత కాబోయే దంపతులు కూడా పోస్ట్ చేశారు.

దీంతో నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు సహా అనేక మంది కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఎంగేజ్మెంట్ కు సంబంధించిన మరికొన్ని పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే చై, శోభిత పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా తెలియలేదు. అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రకటించలేదు. వచ్చే ఏడాది గ్రాండ్ గా వివాహ వేడుక జరగనున్నట్లు జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

రాజస్థాన్ లేదా ఫారిన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిపించాలని అనుకుంటున్నారట. నాగ చైతన్య తండేల్ మూవీ కంప్లీట్ అయ్యాక పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు చై, శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతన్న విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అక్కినేని నాగ చైతన్య 1986 నవంబర్ 23వ తేదీన హైదరాబాద్ లో జన్మించగా, శోభిత ధూళిపాళ్ల 1992 మే 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో పుట్టింది.

ఈ లెక్కన చూస్తే.. చై, శోభిత మధ్య ఏజ్ గ్యాప్ కేవలం ఆరు ఏళ్లు మాత్రమే. కాగా, ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంతతతో చైతన్య వివాహం జరగ్గా.. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. 2017లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. అక్కడికి కొన్ని నెలల తర్వాత శోభితతో నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. పలు పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గత ఏడాది లండన్‌ లోని ఓ రెస్టారెంట్‌ లో ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ తర్వాత ఇటీవల ఇద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. వారి స్టేటస్ లు అండ్ దిగిన పిక్స్ కూడా ఒకేలా కనిపించాయి. దీంతో వారి డేటింగ్ వార్తలకు బలం చేకూరింది. ఆ రూమర్లనే నిజం చేస్తూ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే ఏడడుగులు నడవనున్నారు. మరి చై, శోభిత పెళ్లి ఎక్కడ అవుతుందో? ఎప్పుడు అవుతుందో వేచి చూడాలి.