నాగ చైతన్య జుత్తు..గెడ్డం వెనుక రహస్యం!
యువ సామ్రాట్ నాగచైతన్య ఈ మధ్య గుబురు గెడ్డం..పెరిగిన జుట్టుతో బయట కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Nov 2023 7:54 AM GMTయువ సామ్రాట్ నాగచైతన్య ఈ మధ్య గుబురు గెడ్డం..పెరిగిన జుట్టుతో బయట కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. చందు మొండేటితో తదుపరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో భాగంగా అందులో లుక్ కోసం ఇలా జుట్టు..గెడ్డం పెంచుతున్నాడని తెలుస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మత్సకారుల జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలే ఈ కథకి స్పూర్తి.
అందుకే చైతన్య మత్సకారుడి పాత్ర కోసం లుక్ పరంగా మార్పులు తీసుకొస్తున్నారు. మరి ఈ మార్పు గురించి చైతన్య ఏమంటున్నాడో? తెలుసా? తాజాగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా రిలీజ్ చేసారు. చైతన్య కూడా కొత్తగా యూ ట్యూబ్ ఛానెల్ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. అందులో ఓ యూజర్ గెడ్డం..జుట్టు ఎందుకలా పెంచుతున్నారు? దీని వెనుక రహస్యం ఏంటి? మాకు చెప్పండి అని అడిగాడు.
దానికి చైతన్య అంతే సరదాగా స్పందించారు. `ఆరు నెలలుగా జాబ్ లేదు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నా. పనేం లేక జుట్టు..గెడ్డం పెంచుతున్నా` అంటూ తనలో కామెడీ టైమింగ్ ని బయట పెట్టారు. ఆ తర్వాత కాసేపటికి చందు సినిమా కోసం ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఫోగటో షూట్ జరిగింది. ఔట్ ఫుట్ కూడా బాగా వచ్చింది` అని తెలిపారు. ప్రస్తుతం ఎన్ సీ 23 సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఇక చైతన్య `దూత` అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు. విక్రమ్. కె. కుమార్ ఈసిరీస్ ని డైరెక్ట్ చేయడంతో అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి. డిసెంబర్ లో దూత రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రచారాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. చై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం షురే చేసారు.