బాలీవుడ్ ప్లాన్స్ పై క్లారిటీ ఇచ్చిన చైతూ
కానీ చైతు మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
By: Tupaki Desk | 20 May 2024 11:24 AM GMTఅక్కినేని యువ హీరో నాగ చైతన్య జోష్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. టైర్ 2 హీరోగా మినిమమ్ మార్కెట్ ని కలిగి ఉన్న హీరోలలో చైతూ కూడా ఉన్నాడు. ఆయన నుంచి చివరిగా వచ్చిన థాంక్యూ, కస్టడీ సినిమాలు కమర్షియల్ గా పెద్దగా క్లిక్ కాలేదు. కానీ చైతు మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ కూడా కంప్లీట్ గా మార్చుకున్నాడు. అలాగే ఉత్తరాంధ్ర స్లాంగ్ నేర్చుకొని తన పాత్రకి డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ సినిమాపై నాగ చైతన్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
కచ్చితంగా చైతూ కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ కూడా బలంగా నమ్ముతోంది. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతో చైతన్య బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాలో చైతన్య చేసిన బాలరాజు క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో చైతన్య బిజీ అవుతారని అందరూ భావించారు.
ఇక మరికొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా చైతన్య రిజెక్ట్ చేశాడని కూడా కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ కెరియర్ గురించి తాజాగా చైతన్య ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేసేయాలని తొందరపడటం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అయితే హిందీలో ఎలాంటి సినిమాకి సైన్ చేయలేదని అన్నాడు. అలాగే అమీర్ ఖాన్ తో వర్క్ చేయాలనే ఒక ఒక్క కోరికతో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించడం జరిగిందని తెలిపారు.
మంచి పాత్రలు వస్తే కచ్చితంగా భవిష్యత్తులో బాలీవుడ్ లో చేస్తానని కూడా ఈ సందర్భంగా చైతన్య చెప్పడం విశేషం. ఇప్పుడు ప్రేక్షకులు భాషలతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఎక్కడున్న ఆదరిస్తున్నారని చైతన్య ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం చైతన్య చేస్తోన్న తండేల్ మూవీ తెలుగుతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హిట్ పడితే మాత్రం భవిష్యత్తులో అతని నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని చేసే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తోంది.