ఆమెజాన్ ప్రైమ్ వీడియో 'దూత' ట్రైలర్.. ఎలా ఉందంటే..
ముఖ్యంగా ట్రైలర్ లో టెరిఫిక్ గా కనిపించాడు. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నాగచైతన్య ని సరి కొత్తగా ప్రజెంట్ చేశాడు.
By: Tupaki Desk | 23 Nov 2023 6:14 AM GMTఅక్కినేని యంగ్ హీరో నాగచైతన్య డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెడుతూ నటించిన మొదటి వెబ్ సిరీస్ 'దూత'. ఇష్క్, మనం, 24 వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కే కుమార్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ఈరోజు చైతు బర్త్ డే కావడంతో దూత వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ అభ్యంతం ఆకట్టుకుంది.
దూత ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో చైతు జర్నలిస్టుగా నటించాడు. ఇలాంటి జోనర్ లో చైతు గతంలో ఎప్పుడు సినిమా చేయలేదు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే చైతు తన పాత్రకి పూర్తి న్యాయం చేసినట్లు కనిపించాడు. ముఖ్యంగా ట్రైలర్ లో టెరిఫిక్ గా కనిపించాడు. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నాగచైతన్య ని సరి కొత్తగా ప్రజెంట్ చేశాడు.
జర్నలిస్ట్ అయిన నాగ చైతన్య "మేము మెసెంజర్స్ తెలుగులో చెప్పాలంటే దూతలు" అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్ అండ్ బీజీయం హైలెట్ గా నిలిచాయి. సుమారు 2 నిమిషాల 24 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ షాట్స్ ఎక్కువగా చూపించారు. దీన్నిబట్టి సినిమా అంతా ట్విస్టులు, సస్పెన్స్ లతోనే ఉండబోతుందని అర్థమవుతుంది.
నాగ చైతన్య తనకి సంబంధం లేని ఓ క్రైమ్ లో ఇరుక్కున్నట్టుగా ట్రైలర్ లో చూపించారు.. అలాగే దర్శకుడు విక్రమ్ కె కుమార్ చూపించిన సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే థ్రిల్లింగ్ గా అనిపించింది. అలాగే తన పాత్రలో చైతు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇందులో చైతూకి ఓ గతం ఉన్నట్లు కూడా కొన్ని షాట్స్ చూపించారు. దీన్నిబట్టి జరుగుతున్న పరిణామాలకి చైతూ గతానికి లింక్ ఉన్నట్లు కొంత హిట్ ఇచ్చారు. ఇలాంటి జర్నలిజం బ్యాక్ డ్రాప్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ హిందీలో ఎక్కువగా వచ్చేవి.
కానీ మొదటిసారి విక్రమ్ కె కుమార్ ఇలాంటి ఓ జోనర్ ని తెలుగు ఆడియన్స్ కి అందించబోతున్నారు. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో దూత సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. కాగా ఈ వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ తో ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
దర్శకుడు విక్రమ్ కె కుమార్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లను తీయడంలో నిపుణుడు. ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు మనల్ని కట్టిపడేసేలా తన మార్క్ చూపించాడు. ఇక నాగ చైతన్య పరిశోధనాత్మక జర్నలిస్ట్ పాత్రలో మెరిశాడు. ధూత సాంకేతికంగా అత్యున్నత స్థాయి విజువల్స్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌తో సిరీస్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ “ధూత అంటే 'ది మెసెంజర్', అనూహ్యత. అలాగే అతీంద్రియ అంశాల యొక్క అద్వితీయమైన సమ్మేళనంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ భారతదేశంలోనే కాకుండా 240 దేశాలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రైమ్ వీడియోలో వస్తున్న ది బెస్ట్ సీరీస్ ఇది ఒకటి అన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ.. "విక్రమ్ అలాగే దూత టీమ్‌తో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఎంతో నేర్పింది. నటుడిగా నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ధూత వంటి విభిన్నమైన సిరీస్‌తో నా స్ట్రీమింగ్ అరంగేట్రం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంత పదునైన కథలో సాగర్ పాత్రకు సంబంధించిన ప్రతీ అంశం ఆకట్టుకుంటుంది. నేను నా కంఫర్ట్ జోన్ నుండి బయటపడి ఇంతకు ముందు చేయని విధంగా ఈ పాత్ర చేశాను. ఇది కల్పిత కథ అయినప్పటికీ, ధూత ఎంతో ఆలోచనను రేకెత్తిస్తుంది. ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నప్పుడు నా అభిమానులతో పాటు థ్రిల్లర్ జానర్‌కు సంబంధించిన సినీ లవర్స్ కూడా లైక్ చేస్తారని నాకు నమ్మకం ఉంది" అని నాగ చైతన్య అక్కినేని అన్నారు.
పార్వతి తిరువోతు మాట్లాడుతూ.."ధూతలో క్రాంతి అనే పోలీసు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. నా మొట్టమొదటి తెలుగు ప్రాజెక్ట్ కోసం, కెమెరా ముందు మరియు వెనుక విక్రమ్, నాగ చైతన్య లాంటి ప్రతిభావంతులైన నిపుణుల బృందంతో కలిసి పనిచేసినందుకు నేను థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. ప్రేక్షకుల స్పందన కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇక ఇది బెస్ట్ సిరీస్," అని అన్నారు.
ఇక భారతదేశంలొనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో ఈ దూత వెబ్ సీరీస్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 1 నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లను ప్రసారం చేస్తున్నారు. ఇక భారతదేశంలోని ఆమెజాన్ ప్రైమ్ ఏడాదికి కేవలం రూ.1499కు మెంబర్‌షిప్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే.