Begin typing your search above and press return to search.

హీరోయిన్ తో నాగచైతన్య నిశ్చితార్థం.. నిజమెంత?

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితాలతో ప్రశాంతంగా ఉన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:56 AM GMT
హీరోయిన్ తో నాగచైతన్య నిశ్చితార్థం.. నిజమెంత?
X

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితాలతో ప్రశాంతంగా ఉన్న విషయం తెలిసిందే. ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉంటూ పాజిటివ్ గా ముందుకు కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా నాగచైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి.

గ్లామరస్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల లవ్ స్టోరీ గురించి మీడియాలో ఊహాగానాలు చాలానే వచ్చాయి. ఈ జంట వారి ప్రేమను దాదాపుగా పబ్లిక్‌గా ప్రకటించకపోయినా సన్నిహితులకు మాత్రం ముందుగానే చెప్పినట్లు కూడా టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ లవ్ స్టోరీ కొత్త మలుపు తిరిగిందని టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని, ఇందుకు సంబంధించిన ఎంగేజ్‌మెంట్‌ వేడుక నాగార్జున ఇంట్లో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుందని వార్తలు వస్తున్నాయి. చైతూ, శోభిత గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారని, వారి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించి, వీరి ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం కూడా ఖరారైందని టాక్ వినిపిస్తోంది.

ఈ రోజు లేదా రేపు ఈ ఎంగేజ్‌మెంట్‌ జరగనున్నట్లు, వీరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొననున్నారని సమాచారం. పైగా, ఈ వార్తల నేపథ్యంలో అభిమానుల్లో హడావిడి పెరిగిపోతోంది. సామాజిక మాధ్యమాల్లో చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్తలు మాత్రం మరింత వైరల్ అయ్యాయి.

కింగ్ నాగార్జున గురువారం నాడు ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చైతూ-శోభిత రిలేషన్‌పై ఎలాంటి ఖండనలు లేవు. ఈ వార్తలు నిజమైతే, ఈ జంట కొత్త జీవితం ప్రారంభించబోతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చైతూ ఒక ఇంటివాడు కాబోతున్నాడనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇకపోతే, ఈ వార్తలపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి లేదా శోభిత నుంచి వచ్చే అనౌన్స్మెంట్‌తో ఈ వివాహ బంధం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నాగచైతన్య కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం తండేల్ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.