నాగచైతన్య కొత్త కారు.. చూస్తేనే దిమ్మతిరిగిపోతోంది
Porsche 911 GT3RS కారుని నాగ చైతన్య ఏకంగా 3.5 కోట్లకి పైగా ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కారుకి సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 21 May 2024 8:33 AM GMTఅక్కినేని యువ హీరో నాగ చైతన్యకి కార్లు, బైక్స్ అంటే బాగా ఇష్టం అనే సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఖార్లుగా చెప్పబడే లంబోర్గని చైతూ దగ్గర ఉంది. తెలుగు రాష్ట్రాలలో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే లంబోర్గని కార్లు ఉన్నాయి. ఈ కారు ధర 4 కోట్ల పైనే ఉంటుంది. అలాగే చాలా కంపెనీలకి చెందిన బ్రాండెడ్ కార్లు నాగ చైతన్య కలెక్షన్స్ లో ఉన్నాయి.
ఇప్పుడు మరో ఖరీదైన కారుని చైతూ కొనుగోలు చేశాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్స్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్న పోర్స్చే కారుని కొనుగోలు చేసి ఆ క్లబ్ లో చేరాడు. Porsche 911 GT3RS కారుని నాగ చైతన్య ఏకంగా 3.5 కోట్లకి పైగా ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కారుకి సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటో చూసిన ఫ్యాన్స్ దాన్ని చూస్తేనే దిమ్మతిరిగిపోతోందని, ఇక నడిపోతే ఎలా ఉంటుందో అని అంటున్నారు.
సమయం దొరికినప్పుడల్లా నాగ చైతన్య బైక్ లు, కార్లపై టూర్స్ వెళ్తూ ఉంటాడు. అందుకే అన్ని రకాల బ్రాండెడ్ కార్లు, బైక్స్ ని ఎప్పటికప్పుడు కొనేసి తన గ్యారేజ్ లో పెట్టుకుంటాడు. ఇప్పుడు పోర్స్చే కారు కూడా అతని గ్యారేజ్ లోకి వచ్చి చేరింది. ఇప్పటికే అతని వద్ద ఫెరారీ, ల్యాండ్ రోవర్ మరియు మెర్సిడెస్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బేనర్ లో ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని బాన్నివాసు నిర్మిస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మత్స్యకార జీవితాలలో జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథని తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా నటిస్తోంది.
ఈ ఏడాది ఆఖరిలో తండేల్ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత కార్తిక్ దండు దర్శకత్వంలో చైతన్య ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కానుందంట. విరూపాక్ష మూవీతో సక్సెస్ కొట్టిన కార్తీక్ దండు నాగ చైతన్య కోసం ఎలాంటి కథని సిద్ధం చేసాడనేది తెలియాల్సి ఉంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉన్నట్లు తెలుస్తోంది.