బుజ్జితో చైతూ లాంగ్ డ్రైవ్
కల్కి 2898 ఏడీ మూవీలో భైరవ కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా బుజ్జి అనే కారుని డిజైన్ చేశారు
By: Tupaki Desk | 25 May 2024 10:57 AM GMTకల్కి 2898 ఏడీ మూవీలో భైరవ కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా బుజ్జి అనే కారుని డిజైన్ చేశారు. ఏకంగా 7 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి అధునాతన టెక్నాలజీతో 3 వీల్ కారుని డిజైన్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. నిజానికి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యేకంగా ఇన్ని కోట్లు పెట్టి ఓ కొత్త డిజైన్ తో కారుని తయారు చేయాల్సిన అవసరం లేదు.
సీజీలో ఇంతకంటే అద్భుతమైన కారుని విజువల్ గా సృష్టించవచ్చు. అయితే కల్కి టీం మాత్రం హీరో కోసం నిజంగానే రియల్ కారుని తయారు చేసింది. ఆనంద్ మహేంద్రకి చెందిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నిపుణులు ఈ ప్రత్యేకమైన కారుని కల్కి టీం కోరుకున్న విధంగా రెడీ చేసి ఇచ్చారు. కల్కి 2898ఏడీ మూవీ ప్రమోషన్స్ కూడా ఈ కారుతోనే మొదలు పెట్టారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా బుజ్జిని లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ కారు సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండటం విశేషం. తాజాగా అక్కినేని యువ హీరో నాగ చైతన్య బుజ్జిని రేసింగ్ ట్రాక్ పై డ్రైవ్ చేశాడు. బుజ్జిని డ్రైవ్ చేసిన నాగ చైతన్య తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. నేను కలలో కూడా ఇలాంటి కారుని ఇమాజినేషన్ చేయలేదని చైతూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
ఎవ్వరు ఊహించనిదానిని నిజం చేసిన కల్కి టీమ్ మొత్తానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతమైని చైతూ అన్నారు. బుజ్జితో కొంత సమయం హ్యాపీగా గడిపి చిల్ అయ్యానని ట్వీట్ లో చైతన్య తెలిపాడు. నాగ చైతన్య బుజ్జిని డ్రైవ్ చేసిన వీడియోని వైజయంతీ మూవీస్ ట్విట్టర్(ఎక్స్)లో పంచుకోగా దానిపై చైతన్య రియాక్ట్ అవుతూ అతని అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
ఈ వీడియో చూస్తుంటే సినిమా రిలీజ్ అయ్యేలోపు బుజ్జి దేశం మొత్తం చుట్టేసేలా ఉందనే మాట వినిపిస్తోంది. చాలా మంది హీరోలకి రేసింగ్, స్పోర్ట్స్ కార్లు డ్రైవ్ చేయడం ఇష్టం. అలాంటి వారందరూ కల్కి కోసం తయారు చేసిన ఈ కొత్త మోడల్ కారు బుజ్జిని డ్రైవ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆనంద్ మహేంద్ర కూడా ఈ కారుని రియాలిటీలో తీసుకురావడానికి కల్కి టీమ్ తో పాటు తమ ఇంజనీర్స్ ఏ విధంగా వర్క్ చేసింది ట్విట్టర్ లో తెలియజేశారు.