Begin typing your search above and press return to search.

నాగ చైతన్య 'హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్'

టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్యకు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   22 Aug 2024 9:11 AM GMT
నాగ చైతన్య హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్
X

టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్యకు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదైన బైకులు, కాస్ట్లీ స్పోర్ట్స్ కార్లను కొనుగోలు చేయడంలో చైతు ముందుంటాడు. సినిమాలు లేదంటే రేసింగ్ కు సంబంధించిన అంశాలతో ఈ అక్కినేని హీరో చాలా బిజీగా ఉంటాడు. ఇక తన తాజా సినిమా 'తండేల్' తో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన అభిమానులకు మరో అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు.

మోటార్‌స్పోర్ట్స్ పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన చైతన్య, ఇప్పుడు ఇండియన్ రేసింగ్ లీగ్ (IRL) 2024లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ అనే రేసింగ్ టీమ్‌కు యజమానిగా మారారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ, "ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (IRF) కేవలం ఒక రేస్ మాత్రమే కాదు, నా మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఉన్న ప్రేమను పంచుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ సీజన్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌ని ముందుండి నడపడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది," అని పేర్కొన్నారు.

ఆయన అభిమానులు మాత్రమే కాకుండా, రేసింగ్ ప్రపంచంలో కూడా ఈ నిర్ణయం చాలా ఆసక్తి రేకెత్తించింది. ఇప్పటికే హైదరాబాద్లో గౌర్మెట్ పాన్-ఏషియన్ వంటకాలను అందించే శోయు క్లౌడ్ కిచెన్ ద్వారా చైతన్య మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక నాగ చైతన్య లీడర్షిప్ లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఒక బేస్డ్ రేసింగ్ టీమ్‌గా చరిత్రను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.

మొత్తం ఆరు టీమ్‌లు పాల్గొనే ఈ లీగ్‌లో, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచేలా ఉండనుందని అంచనాలు ఉన్నాయి. ఈ కొత్త పరిణామంతో, ఇండియన్ రేసింగ్ లీగ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. నాగచైతన్య రాకతో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ మరింత ఉత్సాహంగా విజయవంతంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు.

ఇక నాగచైతన్య తండేల్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. బన్నీ వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి ఇదే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అలాగే నాగచైతన్య కు మరిన్ని ఆఫర్స్ వస్తున్నప్పటికీ పూర్తిగా తన ఫోకస్ మొత్తం తండేల్ పైనే పెట్టాడు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని చూస్తున్నాడు.