Begin typing your search above and press return to search.

తండేల్ అసలు కథ ఇది - నాగ చైతన్య

రాజు పాత్రని అర్ధం చేసుకొని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోవడానికి నేను తొమ్మిది నెలలు సమయం తీసుకున్న అని నాగ చైతన్య ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   21 May 2024 11:30 AM GMT
తండేల్ అసలు కథ ఇది - నాగ చైతన్య
X

అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. సాయి పల్లవి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాకుళం నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ స్టోరీపై నాగ చైతన్య క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పాడు. రాజు అనే ఫిషర్ మెన్ లైఫ్ లో జరిగిన సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కుతోందని అన్నారు. సముద్రంపై చేపల వేటకి వెళ్లిన అతను పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ ఆర్మీ అతన్ని జైల్లో పెట్టింది. అతను రెండేళ్లు పాకిస్థాన్ జైల్లో బందీగా ఉన్నాడు.

తరువాత బయటకొచ్చాడు. రాజు పాత్రని అర్ధం చేసుకొని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోవడానికి నేను తొమ్మిది నెలలు సమయం తీసుకున్న అని నాగ చైతన్య ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. నేను చేసే పాత్రల విషయంలో అన్ని పెర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటా. అందుకే శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకోవడంతో పాటు రాజు ఇంటికి కూడా వెళ్లి అతనితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకున్నాను. అతని ధైర్యం, దేశభక్తి చూసిన తర్వాత ఆశ్చర్యం కలిగింది.

మత్స్యకారుల జీవితాల గురించి తెలుసుకోవడానికి వారితో చర్చించడం జరిగింది. నా కెరియర్ లో చేస్తోన్న బిగ్గెస్ట్ మూవీ తండేల్. కచ్చితంగా ఈ సినిమాలో నేను చేసిన రాజు పాత్ర అందరికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్న అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తూ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

నాగ చైతన్య ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతానని నమ్మకంతో ఉన్నాడు. మూవీలో సాయి పల్లవి కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్ లోనే మాట్లాడుతుందని తెలుస్తోంది. ఆమె కూడా ప్రత్యేకంగా ఈ స్లాంగ్ నేర్చుకుందట. లవ్ స్టోరీ లాంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో తండేల్ పై ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లోనే ఉన్నాయి. ఇక సినిమా కోసం ముందే మేకర్స్ చాలాసార్లు వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నారు. ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా రియాలిటీ కి తగ్గట్లే సినిమాను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో సెట్ విజువల్స్ బిగ్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటాయని తెలుస్తోంది.