చైతన్య-శోభిత లవ్.. ఇలా కొనసాగింది..
నాగార్జున ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, అధికారికంగా ఈ శుభవార్తను ప్రకటించారు.
By: Tupaki Desk | 8 Aug 2024 11:27 AM GMTఎట్టకేలకు, చాలా కాలంగా చర్చలలో ఉన్న వార్తలకు తెరపడింది. అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నేడు పెద్దల సమక్షంలో ఒకటిగా దర్శనమిచ్చారు. ఉదయం జరిగిన ఈ సంప్రదాయ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నాగార్జున ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, అధికారికంగా ఈ శుభవార్తను ప్రకటించారు.
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమ సంబంధం గురించి గత నాలుగేళ్లుగా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడు కూడా ఆ విషయంలో ఎవరు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని ఫొటోలు బయటకు వచ్చినప్పటికి ఫ్రెండ్లీగానే కలుసుకున్నారు అన్నట్లు మరికొన్ని కామెంట్స్ వచ్చాయి. మొదట వీరు 2023 మార్చిలో లండన్‌లోని మిచెలిన్ స్టార్ చెఫ్ సురేందర్ మోహన్ యొక్క రెస్టారెంట్లో కనిపించారు.
చైతన్య చెఫ్‌తో ఫోటో దిగినప్పుడు, బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత టేబుల్ వద్ద కూర్చున్నట్టు కనిపించింది. ఈ ఫోటో వైరల్ అయిన తర్వాత, చెఫ్ దానిని తొలగించారు. అనంతరం ఆ ఏడాది ఏప్రిల్‌లో శోభిత తన జంగిల్ సఫారీ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలలో ఆమెతో పాటు జీప్‌లో ఉన్న మరొకరితో కలిసి తీసిన సెల్ఫీలు, పర్యావరణంకు సంబంధించిన చిత్రాలున్నాయి.
ఈ ఫోటోల కంటే ఒక రోజు తర్వాత చైతన్య కూడా సఫారీ జీప్‌లో సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఫోటోను పోస్ట్ చేయడంతో, వీరిద్దరూ కలిసి సఫారీకి వెళ్లినట్టు అనుమానాలు మొదలయ్యాయి. ఒక నెల తర్వాత, వీరు యూరోప్‌లో వేకేషన్కి వెళ్లిన సమయంలో, వీరి వైన్ టేస్టింగ్ సాక్షాత్కారంలో పాల్గొన్న ఫోటో ఒకటి లీక్ అయింది. అంతేకాకుండా, లండన్ వీధుల్లో షాపింగ్ బాగ్స్‌తో కలిసి నడుస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంకా వారు రిలేషన్ లో ఉన్నట్లు ఎన్ని రకాల గాసిప్స్ వచ్చినప్పటికీ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పటి వరకు పుకార్లుగా ఉన్న ఈ వార్తలను నాగార్జున అధికారికంగా నిశ్చితార్థ ఫోటోలతో ధృవీకరించడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. చైతన్య, శోభిత కలిసి ముందుకు సాగుతూ తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారని, వారి వివాహం కూడా త్వరలోనే జరగబోతోందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే, అక్కినేని కుటుంబం నుండి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చైతన్య-శోభిత జంట నిశ్చితార్థం సింపుల్ గా జరిగినప్పటికీ సోషల్ మీడియాలో విషెస్ గ్రాండ్ గా వస్తున్నాయి.