Begin typing your search above and press return to search.

చైతూ-శోభిత.. పర్ఫెక్ట్ మ్యాచ్.. ఎందుకంటే!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల కలిసి జీవితాన్ని పంచుకోడానికి రెడీ అయ్యారు

By:  Tupaki Desk   |   9 Aug 2024 10:09 AM GMT
చైతూ-శోభిత.. పర్ఫెక్ట్ మ్యాచ్.. ఎందుకంటే!
X

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల కలిసి జీవితాన్ని పంచుకోడానికి రెడీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని అక్కినేని నివాసంలో వీరిద్దరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ విషయాన్నికింగ్ నాగార్జున స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ, ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. కొత్త జంట పిక్స్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్న చైతూ-శోభితలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నాగ చైతన్య చాలా చాలా మంచి మనిషి అని ఇండస్ట్రీలో అందరూ చెబుతుంటారు. అతని మనసు బంగారం అని సన్నిహితులు అంటుంటారు. 'అక్కినేని' లాంటి పెద్ద సినీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, ఎక్కడా కూడా ఏమాత్రం గర్వం ప్రదర్శించరు చైతన్య. ఎంత స్టార్‌ డమ్‌ ఉన్నా, దాన్ని ఎక్కడా చూపించకుండా చాలా డౌన్ టూ ఎర్త్ గా ఉంటారు. అభిమానుల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తుంటారు. తన అసిస్టెంట్ లకు, తన దగ్గర పనిచేసే వారికి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా సొంత కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేస్తుంటారు. తన తోటి నటీనటులతో, దర్శకులతో వినయంగా ఉంటారు. తన సినిమాల వల్ల నిర్మాతలు ఇబ్బంది పడితే సపోర్టుగా నిలిచే అతికొద్ది మంది హీరోలలో చైతన్య ఒకరు.

చైతూ చాలా కామ్ గోయింగ్ పర్సన్ అనే సంగతి తెలిసిందే. ప్రతీది చాలా కూల్‌గా డీల్ చేస్తుంటారు. ఒకరకంగా ఆయనకు 'మిస్టర్ కూల్' అనే టైటిల్ ఇవ్వొచ్చు. చై అందరితో పెద్దగా మాట్లాడకపోవచ్చు కానీ, తనకు దగ్గరైన వాళ్ళతో మాత్రం బాగా కలిసిపోతారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఎలాంటి వివాదాలలో తలదూర్చకుండా, తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోయే మనస్తత్వం ఆయనది. జీవితం పట్ల అక్కినేని వారసుడి అప్రోచ్ కూడా మిగతా వారి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతీ విషయంలోనూ ఆచీతూచీ ముందుకు వెళ్తుంటారు.

లెజండరీ యాక్టర్ ఏఎన్నార్ మనవడు, కింగ్ నాగార్జున కొడుకు అనేది పక్కన పెడితే.. నాగచైతన్య ఆటిట్యూడ్, మెంటాలిటీ, ఇతరులతో ప్రవర్తించే విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తన ఫ్యామిలీ మెంబెర్స్ కు, ఫ్రెండ్స్ కు కూడా ఎంతో వాల్యూ ఇస్తారు. చైతూ ఫ్యామిలీ పర్సన్ మాత్రమే కాదు, ప్రైవేట్ పర్సన్ కూడా. అతను ఎక్కువగా ప్రైవేట్ లైఫ్ ను ఇష్టపడుతుంటారు. సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ పెద్దగా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకోరు. సినిమాలకు సంబంధించిన సంగతులు పంచుకోడానికి, ఇతర హీరోల చిత్రాలకు బెస్ట్ విషెస్ అందజేయడానికి మాత్రమే ఇంస్టాగ్రామ్, ఎక్స్ లను ఉపయోగిస్తుంటారు.

గుడ్ హ్యూమన్ బీయింగ్ అని పేరున్న నాగచైతన్య పర్సనల్ లైఫ్ సాఫీగా సాగలేదని ఫ్యాన్స్ నిరాశ చెందారు. సమంత రూత్ ప్రభుతో విడిపోయిన తర్వాత అతన్ని అభిమానించే వారంతా బాధ పడ్డారు. అతనికి ఇలా జరగకుండా ఉంటే బాగుండని అనుకున్నారు. వీలైనంత త్వరగా మూవ్ ఆన్ అవ్వాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. అభిమానులు ఆశించినట్లే విడాకుల తరువాత చైతూ తన కెరీర్ మీదనే ఫోకస్ పెట్టారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తన జీవితంలోకి శోభితా ధూళిపాళ్లను ఆహ్వానించి, ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రెడీ అయ్యారు.

నాగచైతన్య తీసుకున్న నిర్ణయాన్ని అక్కినేని అభిమానులు స్వాగతిస్తున్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించి నాగ్ షేర్ చేసిన ఫోటోలు చూసి మురిసిపోతున్నారు. అందులో శోభిత తన రెండు చేతులతో చైతన్యను పట్టుకొని, అతని భుజం మీద తలవాల్చడం చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంచి మనసున్న చైతూ లైఫ్ లోకి అతన్ని కేరింగ్ గా చూసుకునే శోభిత లాంటి మంచి మనిషి జీవిత భాగస్వామిగా వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. చై చేయి పట్టుకోవడం చూస్తుంటే, జీవితాంతం అతనితో కలిసి నడవడానికి శోభిత సిద్ధపడినట్లు అనిపిస్తోందని అంటున్నారు. వీరిద్దరూ ప్రేమతో హ్యాపీ లైఫ్ లీడ్ చెయ్యాలని కోరుకుంటున్నారు.

అచ్చ తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్లకు భక్తి చాలా ఎక్కువనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఆమె ఉదయాన్నే పూజ చేయడమే కాదు, రోజూ సూర్యాష్టకం చదువుతుందట. వీలు కుదిరినప్పుడల్లా గుళ్ళూ గోపురాలు సందర్శిస్తుంది. ఆమె పూర్తిగా వెజిటేరియన్. తన వంట తనే చేసుకోడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో పనులకి ఎవరి మీదా ఆధారపడకుండా తన పని తానే చేసుకుంటుంది. అలాంటి అమ్మాయి ఇప్పుడు నాగచైతన్యకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ సైతం శోభితను సాదరంగా స్వాగతిస్తున్నామని నాగార్జున పేర్కొన్నారు. ఎంతో సంతోషంతో వీరి జీవితం ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసారు.