నాగచైతన్య స్టన్నింగ్ లుక్.. ఎమున్నడ్రా బాబు..
బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో ఒకవైపు ట్రెడిషనల్ మరొకవైపు స్టైలిష్ స్మైల్ ఉండేవిధంగా నాగచైతన్య కనిపించిన విధానం ఎంతగానో ఆకర్షించింది.
By: Tupaki Desk | 30 Oct 2023 9:08 AM GMTఅక్కినేని నాగచైతన్య సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కంటెంట్ ఉండే కథలను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. తండ్రి తరహాలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నాగచైతన్య రాబోయే సినిమాలతో మరింత డిఫరెంట్ గా అట్రాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాగ చైతన్య మొదటిసారి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
చందు మొండేటి దర్శకత్వంలో రూపొందునున్న NC23 సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఆ ప్రాజెక్టు కోసం చైతన్య చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నెవర్ బిఫోర్ అనేలా లుక్కు ఉండాలి అని కూడా అతను జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఒక సినిమా లాంచ్ లో కనిపించిన నాగచైతన్య లుక్కుతోనే అందరిని అట్రాక్ట్ చేశాడు.
బేబీ కాంబినేషన్లో రూపొందుతున్న ఒక కొత్త ప్రాజెక్టును ఇటీవల లాంచ్ చేశారు. అందులో సంతోష్ శోభన్ అలేఖ్య హారిక జంటగా నటిస్తున్నారు. అయితే ఈ లాంచ్ వేడుకలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న నాగచైతన్య అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో ఒకవైపు ట్రెడిషనల్ మరొకవైపు స్టైలిష్ స్మైల్ ఉండేవిధంగా నాగచైతన్య కనిపించిన విధానం ఎంతగానో ఆకర్షించింది.
అలాగే నాగచైతన్య 23వ సినిమా కోసం పూర్తిస్థాయిలో మళ్లీ గెడ్డం పెంచినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. 2018లో సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గోర్డ్ లకు బందీలుగా చిక్కి దాదాపు ఏడాది పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. అయితే వారి జీవిత ఆధారంగానే దర్శకుడు చందు ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు.
అయితే ఈ సినిమా లుక్కు కోసమే నాగచైతనే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాడు. చూస్తుంటే ఒక లోకల్ మత్స్యకారుడుగా నాగచైతన్య రియాలిటీ కి తగ్గట్టుగా తనను తాను చేంజ్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు అని క్లారిటీ అయితే వస్తోంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.