Begin typing your search above and press return to search.

తండేల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే?

ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండేల్ టైటిల్ వినడానికి ఇంటరెస్టింగ్ గా ఉంది

By:  Tupaki Desk   |   23 Nov 2023 3:59 AM GMT
తండేల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే?
X

నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ లో సినిమా తెరకేక్కబోతున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. తండేల్ అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. అలాగే బోటుని నడిపే ఫిషర్ మెన్ గా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర కనిపిస్తోంది. గెడ్డంతో రఫ్ లుక్ లో చైతన్య క్యారెక్టర్ ని కూడా పోస్టర్ లో చూపించేశారు.

ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండేల్ టైటిల్ వినడానికి ఇంటరెస్టింగ్ గా ఉంది. అయితే అసలు తెలుగులో ఈ పదాన్ని ఎప్పుడూ వెనలేదు. ఉత్తరాంద్ర నేపథ్యంలో పక్కా ఉత్తరాంద్ర యాసలోనే ఈ సినిమాలో చైతన్య పాత్ర మాట్లాడుతుందని తెలుస్తోంది. క్యారెక్టర్ కోసం స్టడీ చేయడానికి చైతన్య విశాఖపట్నం, శ్రీకాకుళం కూడా వెళ్లి అక్కడి జాలరులతో మాట్లాడారు.

ఇదిలా ఉంటే అసలు ఈ టైటిల్ వెనుక కథ ఏంటి అనేది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపించారు. గుజరాత్ తీరంలో వేటకి వెళ్ళే జాలార్ల బోట్లకి ఒక నాయకుడు ఉంటాడు. అతని పేరు తండేల్ అని తెలుస్తోంది. సినిమాలో నాగ చైతన్య పాత్ర పేరు కూడా తండేల్ రాజు అని ఉంటుందంట. గతంలో బన్నీ వాస్ కూడా ఓ యుట్యూబ్ చానల్ లో బోటు నడిపే వాడిని తండేల్ అంటారని చెప్పుకొచ్చారు.

అతని లవ్ స్టొరీని ఈ కథలో చూపించబోతున్నామని అన్నారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది. గార్గీ తర్వాత ఆమె నుంచి రాబోతున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కూడా పోస్టర్ రిలీజ్ రోజే స్టార్ట్ చేసేసారు. యాక్షన్ అండ్ లవ్ స్టొరీగా పీరియాడిక్ జోనర్ లో ఈ మూవీ కథ నుంటుందని తెలుస్తోంది.

మరి నాగ చైతన్య కెరియర్ లో మొదటి సారి డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. అది కూడా చాలా బలమైన పాత్రని హ్యాండిల్ చేయబోతున్నాడు. మరి ఈ తండేల్ మూవీ అతనికి సూపర్ సక్సెస్ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తుందా లేదా అనేది చూడాలి. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్స్ లోకి రావొచ్చని టాక్.