Begin typing your search above and press return to search.

తండేల్.. నాగచైతన్య ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే..

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 May 2024 3:59 AM GMT
తండేల్.. నాగచైతన్య ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే..
X

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని 60 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రెడీ అవుతోంది. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో తండేల్ సినిమా తెరకెక్కుతోంది.

ఈ మూవీలో నాగ చైతన్య రాజు అనే రియల్ లైఫ్ ఫిషర్ మెన్ క్యారెక్టర్ ని చేస్తున్నాడు. అతని లైఫ్ జర్నీగానే ఈ కథ ఉండబోతోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండేల్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన కెరియర్ లో తండేల్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఉంటుందని పేర్కొన్నాడు. చాలా స్ఫూర్తివంతమైన కథగా తండేల్ ఉండబోతోందని తెలిపారు.

ఈ మూవీలో క్యారెక్టర్ లుక్, శ్రీకాకుళం స్లాంగ్ కోసం ఏకంగా ఆరు నెలలు హోమ్ వర్క్ చేశానని అన్నాడు. అలాగే ప్రీప్రొడక్షన్ లో కూడా పాల్గొని ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాను. మత్స్యకారుల జీవితాల గురించి పూర్తిగా తెలుసుకున్నాను. క్యారెక్టరైజేషన్ పెర్ఫెక్ట్షన్ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాను. తండేల్ మూవీ విషయంలో ప్రతిదీ కరెక్ట్ గా ఉండేలా చూసుకొని ఎంతో ఇష్టంతో చేస్తున్నాను.

ఈ కథపై, మూవీపై నాకు చాలా నమ్మకం ఉంది. నా కెరియర్ లో నేను చేస్తోన్న అత్యంత కష్టమైన పాత్ర, అలాగే బెస్ట్ రోల్ తండేల్ మూవీలోనే ఉండబోతోందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాగ చైతన్య మాటల బట్టి తండేల్ సినిమాపై అతను ఎంత కసిగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.

లుక్స్ పరంగా కూడా నాగ చైతన్య చాలా వేరియేషన్ చూపిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి నాగ చైతన్యకి జోడీగా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తప్పకుండా సినిమా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని అప్డేట్స్ ద్వారా అర్ధమవుతుంది. ఇక సినిమాలో యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్ల టాక్.

నాగ చైతన్యకి సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. చివరగా వచ్చిన థాంక్యూ, కస్టడీ సినిమాలు అంతగా ఆడకపోయినా అతనికి మంచి గుర్తింపు దక్కింది. అయితే వీటి తర్వాత చాలా ఇష్టంతో హార్డ్ వర్క్ చేసి తండేల్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం తన కెరియర్ కి స్ట్రాంగ్ బూస్టింగ్ ఇస్తుందని చైతూ భావిస్తున్నాడు.