Begin typing your search above and press return to search.

నాగ‌చైత‌న్య తండేల్.. సంథింగ్ ఏదో ఉంది!

యువ సామ్రాట్ ను ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ లో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ట్రీట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:30 PM GMT
నాగ‌చైత‌న్య తండేల్.. సంథింగ్ ఏదో ఉంది!
X

అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో మ‌రోసారి ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెగ్యుల‌ర్ చాక్లెట్ బోయ్ త‌ర‌హాలో కాకుండా పాకిస్తాన్‌లో ఖైదు అయిన భారతీయ మత్స్యకారుడు రాజు పాత్ర‌లో మాసీగా క‌నిపించ‌బోతున్నాడు. గ్రిప్పింగ్ రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి తండేల్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విశాఖ షెడ్యూల్ పూర్త‌యింద‌ని స‌మాచారం. త‌దుప‌రి హైద‌రాబాద్, దిల్లీ షెడ్యూళ్ల‌తో సినిమా మొత్తం చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని తెలుస్తోంది. రెండు పాట‌లు ఒక ఫైట్ చిత్రీక‌రించాల్సి ఉంది.

యువ సామ్రాట్ ను ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ లో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ట్రీట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. నాలుగు పాట‌లు బిట్ సాంగ్స్ కోసం దేవీశ్రీ ఇప్ప‌టికే త‌న క‌స‌ర‌త్తును సీరియ‌స్ గా సాగిస్తున్న‌ట్టు టాక్ ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీ మ‌రోసారి మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడ‌ని చైతూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.. ఈ మూవీ మేకింగ్ వీడియోలు, పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులలో సంచలనం సృష్టించాయి. ఈసారి చందు మొండేటి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌నే క‌సితో ప‌ని చేస్తున్నాడు. క‌థ ప‌రంగా నిజ‌ఘ‌ట‌న‌ల‌ను ఎంచుకుని, స‌న్నివేశాల్లో ఎమోష‌న్ త‌గ్గ‌కుండా బ్యాలెన్స్ చేస్తున్నాడ‌ని స‌మాచారం.

గతంలో శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ'లో చైతన్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సాయి పల్లవి మళ్లీ తండేల్‌లో చైత‌న్య స‌ర‌స‌న క‌థానాయికగా నటిస్తోంది. సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌, డ్యాన్సులు యూనిక్ గా అల‌రిస్తాయ‌ని అభిమానులు భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 100 ప‌ర్సంట్ ల‌వ్ త‌ర్వాత బ‌న్నివాసు- చైత‌న్య‌- దేవీశ్రీ కాంబినేష‌న్ చిత్ర‌మిది. తండేల్ ఒక అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని, ఇందులో యాక్ష‌న్ అంశాల‌కు కొద‌వేమీ ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఒక అంద‌మైన‌ నిజ జీవిత కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్ర‌య‌త్నం సాగుతోంది. మేకర్స్ 20 డిసెంబర్ 2024 విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకున్నారు.