Begin typing your search above and press return to search.

ఈ కటౌట్ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ పడితే..

అక్కినేని యువ హీరో నాగ చైతన్య కెరియర్ పరంగా చూసుకుంటే ఎక్కువ సక్సెస్ లు ఫ్యామిలీ డ్రామా స్టోరీస్ తోనే అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 8:30 AM GMT
ఈ కటౌట్ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ పడితే..
X

అక్కినేని యువ హీరో నాగ చైతన్య కెరియర్ పరంగా చూసుకుంటే ఎక్కువ సక్సెస్ లు ఫ్యామిలీ డ్రామా స్టోరీస్ తోనే అందుకున్నాడు. యాక్షన్ బేస్డ్ కథలతో తో మూవీస్ చేసిన ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. మజిలీ మూవీతో నాగ చైతన్యకి బిగ్ హిట్ వచ్చింది. ఆ తర్వాత థాంక్యూ, కస్టడీ మూవీస్ కథలు, నాగ చైతన్య యాక్టింగ్ పరంగా పర్వాలేదనే అభిప్రాయం వ్యక్తం అయిన కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు.

ప్రస్తుతం చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. తండేల్ సినిమాలోని క్యారెక్టర్ కోసం నాగ చైతన్య కంప్లీట్ గా లుక్ మార్చేశాడు. గెడ్డం పెంచాడు. అలాగే మాస్ లుక్ లోకి తనని తాను మార్చుకున్నాడు. ఈ లుక్ తో తండేల్ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. తెరపై నాగ చైతన్య స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ప్రస్తుతం నాగ చైతన్య గుబురు గెడ్డం, కళ్ళజోడు పెట్టుకొని చాలా స్టైలిష్ గా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కారు డ్రైవ్ చేయడానికి చైతూ రెడీ అవుతూ ఉండగా ఈ వీడియో షూట్ చేశారు. ఇందులో నాగ చైతన్య కటౌట్ ఒక మాస్ హీరోకి సరిపోయే రేంజ్ లో ఉందనే మాట అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఇదే కటౌట్ లో మంచి కమర్షియల్ యాక్షన్ మూవీ పడితే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనేది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతోన్న వీడియోకి దేవర మూవీ ఫియర్ సాంగ్ ని యాడ్ చేసి అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. నాగ చైతన్యని తాము ఇలా మాస్ హీరోలా చూడాలని అనుకుంటున్నామంటూ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే చైతూ తండేల్ మూవీతో అభిమానుల కోరిక కచ్చితంగా తీరుస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ చిత్రంలో అడ్వాంచర్, యాక్షన్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

రియలిస్టిక్ కథతో తెరకెక్కుతోన్న ఆ సినిమా ఏమాత్రం క్లిక్కయినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తండేల్ కథకి చందూ మొండేటి తప్పకుండా న్యాయం చేయగలడు అని చెప్పవచ్చు. అతని గత చిత్రాలు ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.