ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు..?
ప్రస్తుతం ఇలాంటి ఫెయిల్యూర్స్ యువ హీరోలు నాగ చైతన్య, వరుణ్ తేజ్ లకు ఏర్పడింది.
By: Tupaki Desk | 26 Aug 2023 7:23 PM GMTప్రతి ఒక్క హీరో తమ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటారు. దాని కోసమే వారు చాలా కష్టపడతారు. కానీ, వారు తీసిన అన్ని సినిమాలు హిట్ కాకపోవచ్చు. కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. అది సహజం. తీసిన అన్ని సినిమాలు హిట్ అవ్వడం అనేది ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ, వరసగా ప్లాప్ లు వస్తున్నాయి అంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.
ప్రస్తుతం ఇలాంటి ఫెయిల్యూర్స్ యువ హీరోలు నాగ చైతన్య, వరుణ్ తేజ్ లకు ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల మార్కెట్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఒకప్పుడు లవర్ బాయ్ లుగా చేసి మంచి హిట్స్ అందించిన ఈ హీరోలే, గత కొంతకాలంగా ప్లాప్ లు ఎదుర్కొంటున్నారు.
నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగర్రాజు వంటి హిట్స్ అందుకున్నాడు. ఇవన్నీ వరస హిట్లే. ఇప్పుడు థాంక్యూ, కస్టడీ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. కనీసం, వాటిని ఓటీటీల్లో కూడా ఈ రెండు సినిమాలు చూడటానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు.
ఇక, వరుణ్ తేజ్ విషయంలోనూ అంతే, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, గద్దల కొండ గణేష్ వంటి హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు గని పోయింది. తర్వాత ఎఫ్ 3 చేసినా అదీ పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా గాంఢీవదారి అర్జునతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా బోల్తా కొట్టింది.
ఈ ఇద్దరు హీరోలు తమకు సెట్ అవ్వని జోనర్లు ఎంచుకోవడం తప్పు కాదు కాని అందులో కంటెంట్ బలంగా లేకపోవడం కూడా సినిమా ఫెయిల్యూర్ కారణం కావచ్చు. వీరికి రొమాంటిక్, లవ్ స్టోరీలు చేసినప్పుడు సక్సెస సాధించిన వారు, యాక్షన్ జోనర్లు ఎంచుకున్నప్పుడు బోల్తా పడ్డారు.
ఇక, కథల ఎంపికలు, బలహీనమైన కథనాలు కూడా వీరికి వరస ఫెయిల్యూర్స్ కి కారణం అని తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ హీరోలు కాస్త కొత్తగా ఆలోచిస్తే వారి కెరీర్ గాడిలో పడే అవకాశం లేకపోలేదు.