కాబోయే కోడలిపై నాగ్ ప్రశంసలు.. ఏమన్నారంటే..
ఇక రీసెంట్ గా నాగార్జున కాబోయే కోడలి పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే కోడలి గురించి నాగ్ చాలా బాగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 20 Nov 2024 12:47 PM GMTమరికొన్ని రోజుల్లో అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మొగబోతున్న విషయం తెలిసిందే. యువ హీరో అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగబోతోందన్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పెళ్లి ఆహ్వానాలు, వేడుకలకు సంబంధించిన వివరాలు లీక్ అవ్వడంతో, ఈ జంట వివాహం చర్చనీయాంశంగా మారింది. ఇక రీసెంట్ గా నాగార్జున కాబోయే కోడలి పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే కోడలి గురించి నాగ్ చాలా బాగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ, "శోభితా మనస్పూర్తిగా జీవించే అమ్మాయి. నచ్చిన జీవనశైలిని అందంగా ఎంచుకుంటుంది. తనకు నచ్చిన పనులే చేస్తుంది. ఇది నిజంగా ప్రత్యేకమైన విషయం," అని అన్నారు. తనకు ఆమెతో ఉన్న అనుభూతి చాలా ఆత్మీయంగా అనిపించిందని చెప్పిన నాగార్జున, ఆమె తమ కుటుంబంలోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే నాగ చైతన్యను ఆమె ఎంతో సంతోషంగా ఉంచుతోందని, వీరిద్దరి మధ్య ఉండే అనుబంధం చూస్తే నిజంగా గర్వంగా అనిపిస్తోందని నాగార్జున అన్నారు. శోభితా తన కెరీర్ ను కూడా చాలా తెలివిగా ముందుకు తీసుకువెళ్తోందని, ఆమె చేస్తున్న సినిమాలు తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని అభినందించారు.
అలాగే ఆమె జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం చూసినా, తాను ఎంత ప్రశాంతంగా జీవిస్తోందో అర్థమవుతుంది. ఆమె మత అనుభవం, ప్రేమ, వ్యక్తిత్వం అన్నీ గొప్పవి.. అని అన్నారు.
ఇక ఇండస్ట్రీలో శోభితా మంచి ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా బాగుంటుందని నాగ్ ప్రశంసలు కురిపించారు.
ఫైనల్ గా నాగ్ కాబోయే కోడలు నిజంగా మంచి మనసున్న అమ్మాయి అని ప్రశంసలు కురిపించారు. ఇక ఈ కొత్త జంట ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షేర్ చేసిన ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక పెళ్లి వేడుకలు ఇటీవల విశాఖపట్నంలో ఒక వేడుకతో ప్రారంభమయ్యాయి. అక్కడ పసుపు దంచటం వంటి సంప్రదాయ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శోభితా సంప్రదాయ చీరలో, గోల్డ్ జ్యువెలరీలో మరింత అందంగా మెరిసింది. ఇక ఇప్పటికే అక్కినేని కుటుంబం వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉందని తెలుస్తోంది. ఈ వివాహం రెండు కుటుంబాలకే కాకుండా అభిమానులకు కూడా పెద్ద సందడిగా మారనుంది. ఇక పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోలోనే ఏర్పాట్లు జరగనున్నాయి. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.