కింగ్ తో కొత్త డైరెక్టర్ ..మళ్లీ పాత పల్లవే!
తాజాగా నాగార్జున మరో కొత్త దర్శకుడికి ఒకే చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 11 April 2025 6:33 AMకింగ్ నాగార్జున సోలో రిలీజ్ బాక్సాఫీస్ ముందుకొచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మరో సోలో రిలీజ్ కన్పమ్ అవ్వలేదు. ఇతర్ స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం తప్ప? కింగ్ నుంచి సోలో రిలీజ్ ఎప్పుడని ఏడాదిగా అభిమానులు అడుగుతూనే ఉన్నారు. కానీ దీనికి సమాధానం మాత్రం రాలేదు. అలాగని నాగ్ ప్రయత్నాలు మానుకోలేదు. ఏడాది గా ఒకే మాట వినిపిస్తుంది. రకరకాల దర్శకులు, రచయితల కథలు వింటున్నారు.
వాటిలో కొన్ని సెట్ అయినట్లు కూడా ప్రచారంలోకి వచ్చింది. కొంత మందికి ఒకే చెప్పినా? అవి మధ్యలో వీగిపోయిన ప్రాజెక్ట్ లుగా ప్రచారంలోకి వచ్చింది. రైటర్ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ నవీన్ ప్రాజెక్ట్ లు ఒకే అయిన తర్వాత ఆగిపోయాయని ప్రచారం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి నాగ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం కూడా లేదు. గత ఏడాదంతా అలాగే ముగిసిపోయింది.
కొత్త ఏడాదిలోనైనా గుడ్ న్యూస్ చెబుతారా? అంటే ఈ ఏడాది కూడా అప్పుడే సగానికీ సమీపించింది. కానీ ఇంత వరకూ ఆ గుడ్ న్యూస్ లేదు. తాజాగా నాగార్జున మరో కొత్త దర్శకుడికి ఒకే చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. ఆయన కథకి ఒకే చెప్పినా..ఇదే కథపై మరికొన్ని చర్చలు అవసరం అని నాగ్ భావిస్తున్నారట. అంటే దీనిపై కూడా ఇంకా పూర్తి క్లారిటీ లేనట్లే. ఏడాదిగా వినిపిస్తున్న పాత పల్లవే మళ్లీ తెరపైకి వస్తుంది.
దీంతో నాగార్జున కన్విన్స్ అవ్వడంలో ఎక్కడా రాజీ పడటం లేదని అర్దమవుతుంది. తండేల్ సక్సెస్ తో నాగార్జున చాలా సంతోషపడ్డారు. హిట్ అనే మాట విని చాలా కాలమైంది కాస్త ఎమోషన్ కి గురయ్యారు. ఆ సమయంలో స్టోరీ విషయంలో కింగ్ ఎంతగా రీసెర్చ్ చేస్తున్నారు? అన్నది అర్దమైంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లకు సెట్ అయినంత ఈజీగా నాగార్జునకు ఎందుకనో స్టోరీలు సెట్ అవ్వడం లేదు.