Begin typing your search above and press return to search.

'కల్కి' తో నాగార్జున హ్యాపీ బర్త్‌డే

వైజయంతి మూవీస్‌ అఫిషియల్‌ సోషల్‌ మీడియా పేజ్ లో షేర్ అయిన ఈ ఫోటోలు నెట్టింట తెగ తిరుగుతూ వైరల్‌ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   29 Aug 2024 12:10 PM GMT
కల్కి తో నాగార్జున హ్యాపీ బర్త్‌డే
X

టాలీవుడ్‌ కింగ్ నాగార్జున పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన నటించిన మాస్ సినిమా పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్న సమయంలో కల్కి మేకర్స్‌ షేర్‌ చేసిన ఒక ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైజయంతి మూవీస్‌ అఫిషియల్‌ సోషల్‌ మీడియా పేజ్ లో షేర్ అయిన ఈ ఫోటోలు నెట్టింట తెగ తిరుగుతూ వైరల్‌ అవుతున్నాయి.

రీసెంట్‌ పాన్ ఇండియా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ కల్కి 2898 ఏడి సినిమా నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ వారు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ స్టిల్స్ ను షేర్ చేసి హ్యాపీ బర్త్‌డే కింగ్‌ ఆఫ్‌ హార్ట్స్ అంటూ లవ్ ఈమోజీని షేర్‌ చేశారు. థ్రూ బ్యాక్‌ పిక్చర్స్‌ అంటూ కల్కి మేకింగ్‌ సమయంలో సెట్స్‌ కి నాగార్జున వచ్చిన ఫోటోలను వైజయంతి వారు షేర్‌ చేశారు. కల్కి మేకింగ్‌ సమయంలో ఎంతో మంది స్టార్స్‌, ఇండస్ట్రీ ప్రముఖులు సెట్స్ కు వెళ్లడం జరిగింది. నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరిస్తున్న అద్భుతం ఏంటో అని తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తిని కనబర్చారు.

అశ్విని దత్‌ తో ఉన్న సన్నిహిత్యం ఇంకా ప్రభాస్‌, అమితా బచ్చన్‌ తో ఉన్న స్నేహం ఇతర విషయాల కారణంగా నాగార్జున కల్కి సెట్స్ కి వెళ్లి ఉంటారు. ఒక హీరో సినిమా షూటింగ్‌ సమయంలో సెట్స్ కి మరో హీరో వెళ్లడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి సంఘటన ఇప్పుడు జరగడం అది కూడా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున 'కల్కి' సినిమా సెట్స్ లో సందడి చేయడం అరుదైన కలయిక అన్నట్లుగా సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. షేర్‌ చేసిన ఫోటోలను చూస్తూ ఉంటే కోవిడ్‌ సమయంలో నాగార్జున 'కల్కి' ని కలిసినట్లుగా అనిపిస్తోంది.

కల్కి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రస్తుతం కల్కి 2 సినిమాను రూపొందించేందుకు సిద్దం అవుతున్నారు. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కల్కి సినిమా కు పార్ట్‌ 2 కోసం అభిమానులతో పాటు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2 సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని, మహా భారతంను మరింతగా చూపించడం ద్వారా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవాలని, రికార్డ్‌ స్థాయి వసూళ్లు సొంతం చేసుకోవాలని వైజయంతి మూవీస్ వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ ఆ దిశగా స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడు.