Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ఫ్లాప్ హౌస్ మెట్స్ పై నాగార్జున కామెంట్..!

శనివారం ఎపిసోడ్ లో వారం మొత్తం ఆడిన ఆటలో ఫ్లాప్ షో చేసిన వారిని ప్రస్తావిస్తూ స్టేజ్ మీద నాగార్జున వారి పేర్ల కింద ఒక ప్రాపర్టీ పెట్టి పగలగొట్టారు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 5:43 AM GMT
బిగ్ బాస్ 8 : ఫ్లాప్ హౌస్ మెట్స్ పై నాగార్జున కామెంట్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ అదే శనివారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. హౌస్ లో టాస్కుల్లో ఒకలా ప్రవర్తించిన వారు సడెన్ గా నాగార్జున ముందుకు రాగానే మిగతా హౌస్ మెట్స్ మీద తమకున్న కంప్లైంట్స్ అన్ని వ్యక్తపరిచారు. ముఖ్యంగా నిఖిల్ మీద తన అసంతృప్తిని వ్యక్తపరిచి షాక్ ఇచ్చింది బేబక్క. నిఖిల్ కి సోనియా మీద ఫోకస్ పెరిగిందని తనను కాదని సోనియాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని చెప్పుకొచ్చింది.

నాగార్జున ఇచ్చిన టాస్కులో కత్తితో పొడవాల్సి ఉండగా వారికిచ్చిన ఈ టాస్కులో ఎవరైతే తమకు ఇబ్బంది కలిగిస్తున్నారో అలాంటి వారికి కత్తితో పొడిచారు. బేబక్క నిఖిల్ ఇంకా పృధ్వి రాజ్ తో జరిగిన కాఫీ కప్ ఇష్యూని ప్రస్తావించింది. ఇక విష్ణు ప్రియ సోనియాతో జరిగిన గొడవపై ప్రస్తావించగా విష్ణు ప్రియని కాస్త మందలించారు నాగార్జున. అంతేకాదు నీకు నువ్వు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నావు కానీ ఆటలో అంతగా కనిపించట్లేదని అన్నారు.

శనివారం ఎపిసోడ్ లో వారం మొత్తం ఆడిన ఆటలో ఫ్లాప్ షో చేసిన వారిని ప్రస్తావిస్తూ స్టేజ్ మీద నాగార్జున వారి పేర్ల కింద ఒక ప్రాపర్టీ పెట్టి పగలగొట్టారు. అలా ఐదుగురు హౌస్ మెట్స్ ఆటని ఫ్లాప్ షో అనేశారు నాగార్జున. అందులో ప్రేరణ, బేబక్క, ఆదిత్య ఓం, కిరాక్ సీత, విష్ణు ప్రియ ఉన్నారు. వీరి ఆటని మెరుగుపరచుకోవాలని నాగార్జున ప్రోత్సహించారు.

నాగార్జున మరోసారి వీకెండ్ ఎపిసోడ్ తో మెస్మరైజ్ చేశారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి డౌట్లు క్లియర్ చేస్తూ ఎవరు ఎలా ఉండాలో క్లియర్ కట్ గా వివరించారు. ఐతే నాగ మణికంఠ ఈ వీక్ చాలా ఎమోషనల్ గా ఉన్నాడు కాబట్టి అతని గురించి పెద్దగా మాట్లాడలేదు నాగార్జున. శనివారం ఎపిసోడ్ అలా ముగియగా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో సోనియాని సేవ్ చేసిన నాగార్జున మిగతా ఐదుగురిలో నేడు ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు.

బిగ్ బాస్ లీక్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నేడు ఎలిమినేట్ అయ్యేది బేబక్కే అని అంటున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా తన వీడియోలతో అలరించిన బెజవాడ బేబక్క హౌస్ లోకి వెళ్లిన వారం లోనే ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ గానే ఉంటుంది.