Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో కింగ్ మాఫియా డాన్!

కింగ్ నాగార్జున‌కు స‌రైన యాక్ష‌న్ హిట్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ ద‌శాబ్ధంలోనే కింగ్ ఖాతాలో అలాంటి సినిమా ఒక‌టీ లేదు

By:  Tupaki Desk   |   15 Oct 2024 7:29 AM GMT
ఆ సినిమాలో కింగ్ మాఫియా డాన్!
X

కింగ్ నాగార్జున‌కు స‌రైన యాక్ష‌న్ హిట్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ ద‌శాబ్ధంలోనే కింగ్ ఖాతాలో అలాంటి సినిమా ఒక‌టీ లేదు. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు చేసారు. వాటిలో కొన్ని యావ‌రేజ్ గా ఆడ‌గా..మ‌రికొన్ని ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అయితే వాటిలో నాగ్ పాత్ర‌లేవి మ‌రీ ఓ రేంజ్ కి తీసుకెళ్లిన రోల్స్ కాదు. ప‌వ‌ర్ పుల్ యాక్ష‌న్ ప్యాక్డ్ రోల్స్ అయితే కావు అవి. మాస్, డాన్ రేంజ్ లో ప‌డిన పాత్ర‌లు కావు. అలాంటి సినిమా కోసం నాగ్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ త‌గ‌ల‌డం లేదు.

ఇప్పుడా కోరిక లోకేష్ క‌న‌గ‌రాజ్ చిత్రంతో తీర‌బోతుంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా `కూలీ` చిత్రాన్ని లోకేష్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ర‌జిని కాంత్ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ రోల్ పోషిస్తున్నారు. ఇది లోకేష్ మార్క్ యాక్ష‌న్ చిత్రం. అత‌డి యూనివ‌ర్శ్ నుంచి వ‌స్తోన్న చిత్రం కాదుగానీ, ర‌జిని లాంటి స్టార్ ని పెట్టుకుని చేస్తున్నాడు? అంటే అంత‌కు మించే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

ఇప్ప‌టికే నాగ్ కూడా రివీల్ చేసారు. నాగ్ ని సైమన్‌గా హైలైట్ చేసిన తీరు కాక పుట్టిస్తుంది. డాన్ త‌ర్వాత స‌రైన రోల్ దీన్ని గా భావిస్తున్నారు. ఈలుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా నాగ్ పాత్రకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ లీకైంది. ఈ గ్యాంగ్ స్ట‌ర్ చిత్రంలో కింగ్ డాన్ గా క‌నిపించ‌నున్నారుట‌. సూప‌ర్ స్టార్ ని ఢీకొట్టే ఓ రోల్ ఇద‌ని తెలుస్తోంది.

మ‌రి నాగ్ పాత్ర మెయిన్ రోల్ ఎందుకు కాకూడ‌దు? అంటే లోకేష్ సినిమాలో ప్ర‌ధాన విల‌న్ ని అంచనా వేయ‌డం అంత ఈజీ కాదు. ఆయ‌న స్టోరీ..స్క్రీన్ ప్లేని ర‌క‌ర‌కాలుగా న‌డిపిస్తుంటాడు? ఈ నేప‌థ్యంలో అందుకు త‌గ్గ‌ట్టే తెర‌పై పాత్ర‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయి. `కూలీ` నుంచి నాగ్ ఎంట్రీ అధికారికంగా వ‌చ్చింది. కానీ లోకేష్ చాలా విష‌యాలు దాచాడు అనే ప్ర‌చారం ఉంది. అలా జ‌ర‌గ‌క‌పోతే గనుక మెయిన్ విల‌న్ నాగ్ అవుతారు.