నాగార్జున గెస్టుగా రేపు తండేల్ సక్సెస్ మీట్
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా తండేల్. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది
By: Tupaki Desk | 10 Feb 2025 6:48 AM GMTనాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా తండేల్. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్ల సునామీ చూస్తుంటే తండేల్ మొదటి వారంలోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది.
తండేల్ డే1 ను మించి డే2 వసూలు చేస్తూ, డే3 కూడా అదే స్థాయిలో వసూలు చేసి బాక్సాఫీస్ ను దుల్లగొట్టేస్తుంది. ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే ఫాస్టెస్ట్ రూ.60 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే వంద కోట్లు పడతాయ్, కేకులు రెడీ చేసుకోండి అని హీరో నాగ చైతన్యనే చెప్పిన విషయం తెలిసిందే.
తండేల్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి తాజాగా చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ట్వీట్ చేశాడు. చైతన్య నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది, ఇన్నేళ్లుగా నువ్వెంత కష్టపడ్డావో, ఎన్ని ఛాలెంజెస్‌ను ఎదుర్కొన్నావో నేను చూస్తూనే ఉన్నానని, తండేల్ కేవలం సినిమా మాత్రమే కాదని, అది నీ కష్టానికి నిదర్శనమని నాగార్జున అన్నాడు.
సాయి పల్లవి ఎప్పటిలానే తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసిందని, దేవీ శ్రీ ప్రసాద్ అదరగొట్టాడని, చందూ మొండేటి అద్భుతాన్ని చేశాడని, అల్లు అరవింద్, బన్నీ వాస్‌లకు థాంక్స్ అని నాగార్జున ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్‌ను మేకర్స్ రేపు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
ఈ సక్సెస్ మీట్‌కు కింగ్ నాగార్జున చీఫ్ గెస్టుగా రానున్నట్టు సమాచారం. అయితే తండేల్ రిలీజ్ కు ముందు వరకు నాగార్జున ఆ సినిమా గురించి ఎక్కడా ప్రమోట్ చేసింది లేదు. ఈ నేపథ్యంలో చైతన్యను నాగ్ ఎందుకు తండేల్‌ను ప్రమోట్ చేయడం లేదని మీడియా అడగ్గా, ఆయన ఫ్రీ టైమ్ చూసుకుని సక్సెస్ మీట్ కు తీసుకొస్తానని చైతన్య వెల్లడించినవిషయం తెలిసిందే.