Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : రెడ్ కార్డ్ చూపించి ఫైర్ అయిన నాగార్జున..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ఎప్పుడు లేని విధంగా హోస్ట్ నాగార్జున ఫైర్ అయ్యాడు. కంటెస్టెంట్ అభయ్ నవీన్ కి రెడ్ కార్డ్ చూపించి హౌస్ లో నుంచి బయటకు పోమని ఆర్డర్ వేశాడు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 1:36 PM GMT
బిగ్ బాస్ 8 : రెడ్ కార్డ్ చూపించి ఫైర్ అయిన నాగార్జున..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఎప్పుడు లేని విధంగా హోస్ట్ నాగార్జున ఫైర్ అయ్యాడు. కంటెస్టెంట్ అభయ్ నవీన్ కి రెడ్ కార్డ్ చూపించి హౌస్ లో నుంచి బయటకు పోమని ఆర్డర్ వేశాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారమే చీఫ్ అయిన అభయ్ బిగ్ బాస్ మీద సెటైర్స్ వేశాడు. ఆయనేదో సరదాగా అంటున్నాడని అనుకోగా అది కాస్త సీరియస్ అయ్యింది. ముఖ్యంగా బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమించడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ ని అనడం తో హోస్ట్ నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు.

శనివారం ఎపిసోడ్ మొదటి ప్రోమో లో బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ చెప్పినట్టు వినాల్సిందే అని గట్టిగా చెప్పాడు. అభయ్ కి రెడ్ కార్డ్ చూపిస్తూ హౌస్ లో నుంచి వెళ్లిపోమని అన్నాడు. అభయ్ దానికి మోకాలు మీద కూర్చుని బిగ్ బాస్ కి సారీ చెప్పాడు. ఐతే ఈ ప్రోమో చూపించినట్టుగా అభయ్ నిజంగానే హౌస్ వదిలి వెళ్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

అసలే ఈ వారం నామినేషన్స్ లో అభయ్ కూడా ఉన్నాడు. అతను చేసిన కామెంట్స్ కి ఆడియన్స్ ఓటింగ్ తో పాటుగా బిగ్ బాస్ టీం కూడా అతన్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ లీక్స్ ద్వారా అభయ్ నవీన్ నెక్స్ట్ ఎలిమినేషన్ అని అంటున్నారు. ఇప్పుడు చూస్తే నాగార్జున రెడ్ కార్డ్ తో డైరెక్ట్ గా ఎలిమినేట్ చేశాడు. బహుశా ఎపిసోడ్ లో ఇలా హౌస్ నుంచి వెళ్లడం ఉండకపోవచ్చు కానీ బిగ్ బాస్ నుంచి గట్టి పనిష్మెంట్ మాత్రం ఉండొచ్చని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో నాగార్జున మొదటిసారి రెడ్ కార్డ్ వాడుతున్నారని తెలుస్తుంది. ఐతే ఇప్పటివరకు జరిగిన 7 సీజన్లలో నాగార్జున ఒక్కసారి కూడా రెడ్ కార్డ్ వాడలేదు. మరి శనివారం ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అన్నది చూడాలి. అభయ్ నవీన్ మాత్రం ఈ ఇన్సిడెంట్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అభయ్ కి వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి మిగతా హౌస్ మేట్స్ కూడా బిగ్ బాస్ రూల్స్ విషయంలో తగిన జాగ్రత్త వహించే అవకాశం ఉంటుంది.