Begin typing your search above and press return to search.

నాగ్ లీక్డ్ వీడియో వైరల్

ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీకైన నాగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 1:30 PM GMT
నాగ్ లీక్డ్ వీడియో వైరల్
X

ఒకప్పుడు హిందీలో ప్రత్యేక పాత్రలు పోషిస్తూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఐతే మధ్యలో ఎందుకో పర భాషల్లో నటించడం తగ్గించేశారు. తెలుగులో హీరోగా మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఈ మధ్య వివిధ భాషల్లో మళ్లీ స్పెషల్ రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ‘బ్రహ్మాస్త్ర’లో ఆయన పోషించిన పాత్రకు మంచి స్పందనే వచ్చింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘కుబేర’లో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కూలీ’లో సైతం సైమన్ అనే పాత్రలో నటిస్తున్న విషయం ఇటీవలే వెల్లడైంది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో నాగ్‌ది డాన్ తరహా పాత్ర అని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీకైన నాగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాగ్ డైలాగ్స్ చెబుతుండగా.. ఎవరో షూటింగ్ స్పాట్ నుంచి వీడియో తీశారు. అదిప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ అవుతోంది. ఈ సీన్ తాలూకు సెటప్ అంతా భారీగానే కనిపిస్తోంది. నాగ్ గెటప్, డైలాగ్స్ చూస్తే కొంచెం నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలా అనిపిస్తోంది. షేడ్స్ ఎలా ఉన్నా సరే.. నాగ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడీ క్యారెక్టర్లో. ‘కూలీ’లో నాగ్‌తో పాటు ఉపేంద్ర ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ విలక్షణ నటుడు షోబిన్ కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడు. ‘లియో’తో నిరాశపరిచిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాతో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.