అక్కినేని ఇంట కొత్త కోడలిపై మామ మమకారం
తాజాగా శోభిత గురించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మా కోడలు శోభిత చైతన్య పరిచయడం చేయడానికి ముందే తెలుసన్నారు.
By: Tupaki Desk | 25 Dec 2024 10:30 PM GMTఅక్కినేని నాగచైతన్య-శోభితల వివాహం ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరిది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ వివాహం విషయంలో నాగార్జున ఎంత సంతోషంగా ఉన్నారో? ప్రతీ సందర్భంలోనూ బయట పడుతూనే ఉంది. వివాహానికి ముందే మీడియాతో తనయుడి పెళ్లి గురించి ఎంతో సంతోషంగా మాట్లాడారు. వివాహం అనంతరం శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయంలో కొడుకు కోడలితో దగ్గరుండి ప్రత్యేక పూజలు చేయించారు.
నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదించారు. ఇలా ప్రతీ సందర్భంలోనూ నాగార్జున తనయుడి విషయంలో ఎంతో సంతోషంగా కనిపించారు. తాజాగా శోభిత గురించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మా కోడలు శోభిత చైతన్య పరిచయడం చేయడానికి ముందే తెలుసన్నారు. ఆమె ఎంతో అందమైన అమ్మాయని, మంచి మనసు, వ్యక్తిత్వం గల అమ్మాయిగా అభివర్ణించారు. చైతన్య జీవితంలో శోభిత సగ భాగం అయినందుకు మరింత సంతోషంగా ఉందని మరోసారి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
శోభిత తెలుగింట అమ్మాయి. తెనాలి, విశాఖ పట్టణం ప్రాంతాలతో ఎంతో అనుబంధం ఉంది. మోడలింగ్, బాలీవుడ్ లో సినిమాలు చేసినా? తెలుగు మూలాలు ఎక్కడా మర్చిపోలేదు. తెలుగు సంప్రదాయాలు ఆమెకు చిన్న నాటి నుంచే అలవాటయ్యాయి. ఉదయాన్నే తలంటుకుని పూజలు చేయడం, సూర్య నమస్కారం ఇలా కొన్ని గొప్ప లక్షణాలు శోభితలో ఉన్నాయి. ఓ తెలుగు అమ్మాయి అక్కినేని ఇంట కోడలవ్వడంతో నాగార్జున కుటుంబం మరింత సంతోషంగా కనిపిస్తుంది.
అలాగే శోభితకు అక్కినేని ఫ్యామిలీ కావాల్సినంత స్వేచ్చ ఇచ్చింది. నటిగా సినిమాలు చేసుకునే అవకాశం ఉంది. మరి అక్కినేని ఇంట కోడలు కొత్త ఏడాదిలో కొత్త సినిమా విశేషాలు చెబుతుందా? లేదా? అన్నది చూడాలి. చైతన్య మాత్రం వచ్చే ఏడాది పాన్ ఇండియా చిత్రం 'తండేల్' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయిన సంగతి తెలిసిందే.