సోలోగా దిగేదెప్పుడు?
సోలోగా కింగ్ నాగార్జున దిగేదెప్పుడు? అవును ఇప్పుడు అక్కినేని అభిమానుల నుంచి వినిపిస్తోన్న మాట.
By: Tupaki Desk | 7 Dec 2024 9:30 AM GMTసోలోగా కింగ్ నాగార్జున దిగేదెప్పుడు? అవును ఇప్పుడు అక్కినేని అభిమానుల నుంచి వినిపిస్తోన్న మాట. సంక్రాంతి కానుకగా నాగ్ నుంచి `నా సామిరంగ` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంక్రాతి సీజన్ లో మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని నాగార్జున అప్పటికప్పుడు పట్టాలెక్కించి సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్రమది. ఆ విజయం తర్వాత మళ్లీ నాగ్ నుంచి సోలో ప్రాజెక్ట్ రాలేదు. దీంతో నాగ్ మాస్ జాతర మళ్లీ ఎప్పుడు? అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.
ప్రస్తుతం నాగార్జున ఇతర హీరోలతో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ధనుష్ ..నాగార్జు న ప్రధాన పాత్రల్లో `కుబేర` తెరకెక్కుతుంది. ఇందులో నాగ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ములా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. ధనుష్ మెయిన్ రోల్ కావడంతో పాన్ ఇండియా వైడ్ భారీ అంచనా లున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ . పక్కా లోకేష్ మార్క్ చిత్రంగా రూపొందుతుంది. ఈ రెండు సినిమాలపై పాన్ ఇండియాలో అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. నాగార్జున చాలా కాలంగా రీజనల్ చిత్రాల్లోనే నటిస్తున్నారు. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా అక్కడ కంటున్యూ అవ్వలేదు. తెలుగు వరకే తన సినిమాల్ని పరిమితం చేసారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు.
అయిత్ కింగ్ నుంచి సోలో ప్రాజెక్ట్ మాత్రం ఒకటి వచ్చే ఏడాది ప్రకటించే అవకాశం ఉంది. `హుషార్` ఫేం హర్ష కొనుగంటితో కొంత కాలంగా నాగ్ స్టోరీ డిస్కషన్ లో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అవుతుందని వినిపిస్తుంది. స్టోరీ నచ్చడంతో నాగ్ ఒప్పుకున్నట్లేనని అంటున్నారు. ఆ విషయం అధికారికంగా వచ్చే ఏడాది బయటకు వస్తుందని సమాచారం.