Begin typing your search above and press return to search.

నాగ్ సర్ మీ సీనియారిటీకి ఇది తగునా..?

కుబేర, కూలీ సినిమాలకు ఓకే చెప్పిన నాగార్జున తన సోలో సినిమా కథను మాత్రం కన్ఫర్మ్ చేయలేకపోతున్నాడు.

By:  Tupaki Desk   |   3 April 2025 8:30 PM
నాగ్ సర్ మీ సీనియారిటీకి ఇది తగునా..?
X

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినిమాలు చేస్తూ 90కి పైగా సినిమాలు చేసిన మన కింగ్ నాగార్జున ఒక సూపర్ హిట్ సినిమా అందుకున్న తర్వాత మరో సినిమా కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కూడా దాదాపు ఆ సినిమా రిలీజై ఏడాదిన్నర అవుతున్నా మరో సినిమా కన్ఫర్మ్ చేయలేదు. నాగార్జున హీరోగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో నా సామిరంగ సినిమా చేశాడు. ఈ సినిమా హిట్ జోష్ తో వెంటనే మరో సినిమా చేస్తాడని అనుకుంటే అది కాస్త లేట్ అవుతూ వస్తుంది.

మరోపక్క నాగార్జున కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర సినిమాలో నాగార్జున స్పెషల్ రోల్ చేస్తుండగా మరోపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున నటిస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాలో నాగార్జున రోల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.

కుబేర, కూలీ సినిమాలకు ఓకే చెప్పిన నాగార్జున తన సోలో సినిమా కథను మాత్రం కన్ఫర్మ్ చేయలేకపోతున్నాడు. నా సామిరంగ తర్వాత అదే టీం తో మరో సినిమా చేయాలని అనుకోగా అది ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత వరుస కథలు వింటున్నా కూడా తన రేంజ్ సినిమాలు కాదని అనిపించడంతో వాటిని కాదంటున్నారట. నాగార్జున కొత్త సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉండగా అది మరింత లేట్ అవుతూ వస్తున్నాయి.

నాగార్జున నెక్స్ట్ సోలో సినిమా ఏది అన్నది తెలుసుకోవాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. నా సామిరంగ సినిమా రిలీజ్ టైం లో ఇక మీదట ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వస్తానని చెప్పిన నాగ్ ఈ సంక్రాంతి మిస్ చేశాడు. మరి 2026 సంక్రాంతికైనా సినిమా వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. నాగార్జునకు ఉన్న ఈ సీనియారిటీకి ఒక మంచి కథను ఎంపిక చేసుకోకపోవడం ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. మరి మన బాస్ ఏం ఆలోచిస్తున్నాడో తెలియట్లేదు. సీనియర్ హీరోలంతా కూడా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తుంటే నాగార్జున మాత్రం ఇలా టైం తీసుకోవడం అక్కినేని ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది.