Begin typing your search above and press return to search.

కూలీ కింగ్ షాక్ ఇస్తాడా..?

జైలర్ తో సూపర్ ఫాంలోకి వచ్చిన రజినీకాంత్ వేట్టయ్యన్ తో కూడా మెప్పించాడు.

By:  Tupaki Desk   |   14 Jan 2025 3:30 PM GMT
కూలీ కింగ్ షాక్ ఇస్తాడా..?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ. కోలీవుడ్ లో వరుస క్రేజీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు లోకేష్ కనకరాజ్. ఐతే ఈ సినిమా విషయంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జైలర్ తో సూపర్ ఫాంలోకి వచ్చిన రజినీకాంత్ వేట్టయ్యన్ తో కూడా మెప్పించాడు. ఇక ప్రస్తుతం కూలీతో త్వరలో రాబోతున్నాడు. కూలీ సినిమాను లోకేష్ కనకరాజ్ మార్క్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో రజినితో పాటుగా మన కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడు. నాగార్జున ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. సినిమాలో ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుది. నాగార్జున రోల్ ని ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా ప్లాన్ చేస్తున్నారట లోకేష్ కనకరాజ్. కూలీ సినిమాలో కింగ్ నాగార్జున రోల్ అటు తమిళ్ ఆడియన్స్ నే కాదు తెలుగు ప్రేక్షకులను ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా నటిస్తున్నాడు. సినిమాలో ఈ ఇద్దరి రోల్స్ ప్రత్యేకంగా నిలుస్తాయని అంటున్నారు. నాగార్జున రోల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయని. అవి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తాయని అంటున్నారు. సినిమా హైలెట్స్ లో నాగార్జున పాత్ర కూడా ఒకటని అంటున్నారు.

కింగ్ నాగార్జున, ఉపేంద్ర పాత్రలు కూలీ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీతో మరోసారి బాక్సాఫీస్ పై సత్తా చాటాలని చూస్తున్నారు. రజినీకాంత్ లోకేష్ ఈ కాంబో ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది. ఆల్రెడీ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోగా సినిమా నుంచి నాగార్జున తో పాటు మిగతా కాస్ట్ పరిచయం ఎప్పుడన్నది చూడాలి. కూలీ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు. సినిమాను మాత్రం మే 1న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న రెట్రో సినిమా కూడా మే 1న రిలీజ్ అనుకుంటున్నారు. ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ షురూ అయ్యేలా ఉంది.