Begin typing your search above and press return to search.

తండేల్ చూసిన నాగార్జున.. అవుట్‌పుట్‌పై ఏమన్నారంటే..

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అద్భుతమైన హైప్ క్రియేట్ చేయగా, ట్రైలర్‌కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.

By:  Tupaki Desk   |   5 Feb 2025 7:46 AM GMT
తండేల్ చూసిన నాగార్జున.. అవుట్‌పుట్‌పై ఏమన్నారంటే..
X

యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిఫరెంట్ హై ఎమోషనల్ డ్రామాతో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అద్భుతమైన హైప్ క్రియేట్ చేయగా, ట్రైలర్‌కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు ముందు మంచి ప్రమోషన్ తో పాజిటివ్ హైప్ క్రియేట్ చేసుకుంటోంది. సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, ఇటీవలి సినిమాను చూసిన టాప్ సెలబ్రెటీల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. నాగ చైతన్యకు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ఆయన ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌తో, మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

సినిమా కథాంశం నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా ఉండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా తండేల్ స్పెషల్ స్క్రీనింగ్‌కి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హాజరయ్యారు. మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రివ్యూను వీక్షించిన ఆయన సినిమా అవుట్‌పుట్‌పై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సినిమా భావోద్వేగాలతో నిండిపోయి ఉందని, యాక్షన్, డ్రామా, రొమాన్స్ అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా మిళితమైన మంచి సినిమా అని ప్రశంసించినట్లు సమాచారం.

ముఖ్యంగా నాగ చైతన్య పాత్రకు, సాయి పల్లవి నటనకు నాగార్జున ఫిదా అయ్యారని టాక్. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ మధ్య నిర్మాత అరవింద్ కూడా సినిమాను చూసి మెచ్చుకోగా, తమిళ హీరో కార్తి, బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్‌ థండేల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది సినిమా పట్ల ఉన్న భారీ అంచనాలకు నిదర్శనం. ఇప్పుడు నాగార్జున సినిమా చూసి సంతోషంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

డీఎస్పీ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. సినిమా విడుదలకు ముందే భారీ బజ్ తెచ్చుకున్న తండేల్, థియేటర్లలో భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య కెరీర్‌లో ఇది అత్యంత ముఖ్యమైన సినిమా కావడంతో, ఈ సినిమా విజయం అతనికి మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయం. ఫిబ్రవరి 7న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.