టాలీవుడ్ స్టార్లకు ఇది అంటే చాలా మోజు!
కాస్ట్ లీ కార్ల ప్రేమికులుగా వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
By: Tupaki Desk | 29 Nov 2024 6:00 AM GMTకింగ్ నాగార్జున - నాగచైతన్య ఇద్దరూ ఆటోమోటివ్ ప్రియులు అన్న సంగతి తెలిసిందే. గ్యారేజీలో వెరైటీ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి. మర్కెట్లోకి కొత్త కార్ వస్తోంది అంటే కచ్ఛితంగా దానిపై ఒక లుక్కేసి ఉంచుతారు. నచ్చిన కార్ గ్యారేజీలోకి రావాల్సిందే. కాస్ట్ లీ కార్ల ప్రేమికులుగా వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
పరిశ్రమలో ఇప్పుడు టయోటాలు, రేంజ్ రోవర్ వంటివి చాలా కామన్. ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్లు అల్ట్రా స్టైలిష్ విదేశీ లగ్జరీ కార్ లంబోర్ఘిణిలను సొంతం చేసుకున్నారు. అదంతా అటుంచితే ఇటీవల పలువురు హీరోలు లగ్జరీ SUV మోడల్స్ లో `లెక్సస్` మోడల్ పై మనసు పడుతున్నారు. నాగార్జున ఇటీవల `విఐపి`ని కలిగి ఉన్న హై-ఎండ్ లెక్సస్ మోడల్ కార్ ని కొనుగోలు చేసారు. రూ. 2.46 కోట్లు-రూ. 2.80 కోట్ల రేంజులో ఇది ఉంది. ఆర్టీఏ ఫార్మాల్టీస్ పూర్తి చేసి కొత్త లగ్జరీ వాహనాన్ని ఇంటికి తీసుకుని వెళ్లారు.
ఇక మెగా ఫ్యామిలీలో మారుతున్న బ్రాండ్లపై దృష్టి సారించేవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఖరీదైన కార్లపై చాలా ఆసక్తి. అతడి గ్యారేజీలో లెక్కలేనన్ని కార్లు ఉన్నాయి. అయినా అతడికి లెక్సస్ కార్ అంటే చెప్పలేనంత ఇష్టం. దానిని ఎక్కువగా ఉపయోగిస్తారు చరణ్. ఇటీవల ట్రెండ్ ని బట్టి టాలీవుడ్ ప్రముఖ స్టార్లు అందరూ లెక్సస్ కార్ ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని గుసగుస వినిపిస్తోంది.