Begin typing your search above and press return to search.

కూలీ, కుబేర సినిమాల గురించి నాగ్..

‘‘లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నా. ఇది రజినీకాంత్ గారి సినిమా. లోకేష్ కొత్త తరం దర్శకుడు.

By:  Tupaki Desk   |   27 Feb 2025 3:30 PM GMT
కూలీ, కుబేర సినిమాల గురించి నాగ్..
X

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పుడు భిన్నమైన దారిలో నడుస్తున్నారు. ‘నా సామి రంగ’ తర్వాత సోలో హీరోగా కొత్త సినిమానే అనౌన్స్ చేయని నాగ్.. వేరే హీరోలు నటిస్తున్న చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. ఇలా ఆయన నటిస్తున్న రెండు క్రేజీ చిత్రాలు.. కూలీ, కుబేర. ఇందులో ‘కూలీ’ మీద ఉన్న అంచనాలే వేరు. అది సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా. పైగా ఖైదీ, విక్రమ్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దాన్ని రూపొందిస్తున్నాడు.

ఇక శేఖర్ కమ్ముల లాంటి విలక్షణ దర్శకుడు ధనుష్ హీరోగా రూపొందిస్తున్న ‘కుబేర’లోనూ నాగ్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల గురించి నాగ్ ఇప్పటిదాకా మాట్లాడింది లేదు. తాజాగా ఒక కార్యక్రమంలో నాగ్ కూలీ, కుబేర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నాడంటే..

‘‘లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నా. ఇది రజినీకాంత్ గారి సినిమా. లోకేష్ కొత్త తరం దర్శకుడు. తన ఫిలిం మేకింగ్.. క్యారెక్టర్లు.. స్క్రీన్ ప్లే అన్నీ కొత్తగా అనిపిస్తాయి. ఆ సినిమాలో నటించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తున్నా. క్యారెక్టర్ల విషయంలో అతను చాలా స్వేచ్ఛ ఇస్తాడు. హీరో అంటే ఇలాగే ఉండాలి.. విలన్ అంటే ఇలాగే ప్రవర్తించాలి.. ఇలాంటి రూల్స్ ఏమీ ఉండవు. చాలా ఫ్రీగా ఉంటాడు.

ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ‘కుబేర’ విషయంలో కూడా నాకు కొత్తగా అనిపించింది. అందులో ధనుష్‌తో కలిసి నటిస్తున్నా. శేఖర్ కమ్ములా ఎలాంటి దర్శకుడో అందరికీ తెలుసు. అతను చాలా రియలిస్టిగ్గా సినిమాలు తీస్తాడు. తన మేకింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. నేను ఈ రెండు చిత్రాలతో ఒక ప్రయోగం చేస్తున్నట్లే. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని నాగార్జున తెలిపాడు. ‘కుబేర’ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. వేసవిలోనే రావాల్సిన ‘కూలీ’ ఆగస్టుకు వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.