నవీన్ తో నాగార్జున ఇంకా సస్పెన్స్ లోనేనా!
అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా కన్పమ్ అయినట్లు లేదని తాజాగా అందుతోన్న సమాచారం.
By: Tupaki Desk | 24 Feb 2025 6:49 AM GMTకింగ్ నాగార్జున కథానాయకుడిగా తమిళ యువ దర్శకుడు నవీన్ తో ఓ సినిమా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రచారమంతా కొన్ని నెలలుగా జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా కన్పమ్ అయినట్లు లేదని తాజాగా అందుతోన్న సమాచారం. స్క్రిప్ట్ విషయంలో కింగ్ అసంతృప్తిగా ఉన్నారని ,నాగార్జున సూచించిన మార్పుల విషయంలో నవీన్ తడబడుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఈ కారణంగా ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారికంగా వెల్లడించిడం లేదని మీడియా కథనాల సారాంశం. దీంతో 'కుభేర' తర్వాత నాగార్జున ప్రాజెక్ట్ పై ఇంకా సస్పెన్స్ తప్పేలా లేదు. ఇప్పటికే 'కుభేర' షూటింగ్ పూర్తయింది. ఇందులో నాగార్జున ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున తదుపరి ఏ సినిమా చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
నవీన్ సిద్దం చేయాల్సిన స్టోరీ సిద్దమయ్యే వరకూ వెయిట్ చేస్తారా? లేక కొత్త దర్శకుడిని తెరపైకి తెస్తారా? అన్నది చూడాలి. స్టోరీ విషయంలో నాగార్జున కొంత కాలంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రైటర్ ప్రసన్న కుమా ర్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాతో ప్రసన్న కుమార్ దర్శకుడిగా పరిచయం అవ్వాలి. కానీ ఆ స్టోరీ విషయంలో కూడా నాగార్జున సంతృప్తి చెందకపోవడంతో? ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇప్పుడు నవీన్ కథ విషయంలోనూ సన్నివేశం అలాగే కనిపిస్తుంది. స్టోరీల విషయంలో కింగ్ కేరింగ్ ఎక్కువ అవ్వడంతో ఈ రకమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున 'కూలీ' షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరికొన్ని రోజుల్లో షూట్ నుంచి రిలీవ్ అవుతారు. అటుపై నాగార్జున సోలో ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి.