Begin typing your search above and press return to search.

అక్కినేని వారసులు.. నాగ్ సపోర్ట్ ఉన్నట్లే కానీ..

అదే పరిస్థితి అఖిల్ విషయంలో మరింత క్లిష్టంగా మారింది. ‘మిస్టర్ మజ్ను’ తర్వాత హిట్ లేకపోవడంతో, అతను లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   11 March 2025 3:00 PM IST
అక్కినేని వారసులు.. నాగ్ సపోర్ట్ ఉన్నట్లే కానీ..
X

టాలీవుడ్‌లో అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ ఎంతో ప్రతిభ కలిగిన నటులే. అయితే, వీరిద్దరి కెరీర్ కూడా అంత సాఫీగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో వారిని మళ్లీ లైన్‌లోకి తెచ్చేందుకు నాగార్జున పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ వస్తోంది. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నాగ చైతన్యకి ‘మజిలీ’ వంటి హిట్ ఉన్నా, తర్వాతి సినిమాలు పెద్దగా ఆడలేదు. తండేల్ తో అతను మళ్లీ గట్టిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. కానీ స్టార్ హీరో స్థాయికి వెళ్లాలంటే కంటిన్యూస్‌గా హిట్లు ఉండాలి.

అదే పరిస్థితి అఖిల్ విషయంలో మరింత క్లిష్టంగా మారింది. ‘మిస్టర్ మజ్ను’ తర్వాత హిట్ లేకపోవడంతో, అతను లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. పైగా మొదటి సినిమా అఖిల్ కంటే కూడా ఈమధ్య వచ్చిన ఏజెంట్ సినిమా కూడా గట్టి దెబ్బ కొట్టింది. కనీసం ఓటీటీలో కూడా తొందరగా రాకపోవడంతో ఆ ఎఫెక్ట్ కెరీర్ పై పడింది. ఇలా ఇద్దరు వారసులు కష్టాల్లో ఉన్నప్పుడు, నాగార్జున వాళ్ల కోసం ఏ విధంగా సపోర్ట్ చేయలేదా అనే డౌట్స్ అందరిలో కలుగుతుంది.

నిజానికి నాగార్జున అవసరమైన సమయంలో కొడుకులకు సరైన సపోర్ట్ ఇచ్చారు. అలాగని స్వేచ్ఛను ఇవ్వలేదు. కొడుకులకు పర్సనల్ లైఫ్ లో ఏం కావాలో అది కాస్ట్లీగానే ఇచ్చారు. కానీ సినిమా కెరీర్ విషయంలో మాత్రం ఆయన ఎక్కువగా జోక్యం చేసుకోలేదనే వాదన ఉంది. అప్పుడప్పుడు సొంతంగా కథల విషయంలో నిర్ణయాలు తీసుకునేలా అలవాటు చేశారు. నిజానికి నాగార్జున పూర్తిగా వారిని వదలలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్యతో మనం, ఒక లైలా కోసం, రారొండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు లాంటి సినిమాలు నిర్మించారు.

ఇక అఖిల్ కు సంబంధించిన కథల విషయంలో నాగార్జున ఎల్లప్పుడూ సపోర్ట్ గానే ఉన్నారు. హలొ అనే సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించారు. ఇక అఖిల్ కు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంది కాబట్టి బయట ప్రొడక్షన్ లో సినిమాలు చేశాడు. ఏజెంట్ విషయంలో అనుభవం ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఉండడం వలన ఆయన ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. కానీ బ్యాడ్ లక్ వల్ల సినిమా డిజాస్టర్ అయ్యింది.

నాగార్జున డబ్బులు వృధా చేయరు అని, టాలీవుడ్‌లోనే కాకుండా బిజినెస్ వలయంలో కూడా ఆయనది పెద్ద పేరు ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి మద్దతుతో పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేయడం ఆయనకు పెద్ద సమస్య కాదు. కానీ, నాగార్జున కొడుకులను సొంతంగా ఎదిగేలా ప్రయత్నం చేస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. నిజానికి నాగార్జున తన సినిమాలను కూడా హై బడ్జెట్‌లో చేయడు. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయినా కూడా, ప్రయోగాల కోసం పెద్ద పెట్టుబడులు పెట్టడం ఆయనకు అలవాటు లేదు.

అలాగే, ఆయన తనయుల కెరీర్ విషయంలో వాళ్లను స్వతంత్రంగా ఎదిగేలా ఉంచాలని భావిస్తున్నారనే డౌట్ కలుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో అఖిల్ తన కొత్త సినిమా కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను ఎంచుకున్నాడు. నాగార్జున మాత్రం ‘ప్రెజెంటర్’గా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. అంటే, నిర్మాణంలో పెద్దగా మద్దతు ఉండదనే విషయం స్పష్టమైంది. ఇదే నాగ చైతన్య విషయంలోనూ కనిపిస్తోంది. ఏదేమైనా, అక్కినేని వారసులు మళ్లీ లైన్‌లోకి రావాలంటే కేవలం పెద్ద బ్యానర్ల సపోర్ట్ మాత్రమే కాదు, వాళ్లకు సరైన కథలు, మునుపటి వైభవాన్ని తీసుకొచ్చే స్ట్రాటజీ అవసరం. అది లేకుండా ఉంటే, వాళ్ల కెరీర్ రిస్క్‌లో పడే అవకాశం ఉంది. మరి నాగ్ నెక్స్ట్ ఎలాంటి స్ట్రాటజీతో సపోర్ట్ ఇస్తారో చూడాలి.